హైదరాబాద్ జూన్ 9
రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేసేందుకు నిన్న సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసిన విషయం విదితమే. జూన్ మొదటివారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్‌నలపై నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాక్‌లాగ్ ఉన్న సెకండియర్ విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వనుంది.