YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను, ఆర్టీ పీసీఆర్ ను  ఆర్థిక మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రారంభించారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం  ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలకు 57   రకాల పరీక్ష లు ఉచితంగా చేయనున్నారు. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు , ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో కి వచ్చాయి. రాష్ట్రంలో 19  డయాగ్నస్టిక్ కేంద్రాలు ఆయా జిల్లాల్లో అందుబాటులో కి వచ్చాయి. మరో 16 కేంద్రాలు  త్వరలోనే ప్రారంభం అవుతాయి. కిడ్నీ, లివర్, థైరాయిడ్, గుండెజబ్బులు వంటి 90  శాతం వ్యాధులకు ఉచితంగా పరీక్షలు జరుపుతారు.
సంగారెడ్డి  జిల్లా లోని 25  పీహెచ్సీ, యూహెచ్ సీల నుండి రక్త నమూనాలు ఇక్కడ పరీక్ష చేస్తారు. 24  గంటల్లోనే పరీక్ష ఫలితాలు సెల్ ఫోన్లకు ఎస్.ఎం.ఎస్ రూపంలో వస్తాయి. 550 కోట్లతో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాల ఏర్పాటు. 260కోట్లతో 650 పడకలతో ఆధునాతన సౌరక్యాలతో కొత్త ఆసుపత్రి నిర్మిస్తాం. సంగారెడ్డి జిల్లా ప్రజలకు త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులో కి రానున్నాయి. రెండు కోట్ల యాభైలక్షలతో కొత్త సీటీస్కాన్ యంత్రం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోకి తెస్తామని అన్నారు.
 

Related Posts