విజయవాడ జూన్ 9
స్వాతంత్ర సమరయోధులు, సీనియర్ పార్లమెంటేరియన్.... భారత రైతాంగ ఉద్యమ నిర్మాతలలో ఒకరైన ఆచార్య ఎన్.జి రంగా వర్ధంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఘన నివాళులర్పించారు. దీర్ఘకాలం రైతుల సంక్షేమం.... వారి సమస్యల పరిష్కారం కు శ్రీ రంగా చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు.
పార్లమెంటు లోపల వెలుపల ఆర్థికపరమైన అంశాలపైన శ్రీ రంగా అనర్గళంగా మాట్లాడేవారని అన్నారు. యువతకు రాజకీయాలు నేర్పేందుకు పాఠశాలను నెలకొల్పడం అటుంచి.... ఆ పాఠశాలను మహాత్మా గాంధీచే ప్రారంభింప చేయటం గొప్ప విషయమంటూ శ్లాఘించారు. ఇంతటి మహనీయుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ నేటి యువత ముందడుగు వేయాలని శ్రీ నాయుడు పిలుపునిచ్చారు.