YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటలకు షర్మిల ఆహ్వానం

ఈటలకు షర్మిల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 9, 
జూలై 8న పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నామని వైయస్ షర్మిల ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీఠ వేస్తామన్న ఆమె, కార్యకర్తలే రేపటి ప్రజానాయకులని చెప్పారు. వైయస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలి.. వారి వివరాలు, కష్టాలు తెలుసుకోవాలని షర్మిల పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇవాళ సన్నాహాక సమావేశం నిర్వహించారామె. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌ పాండ్‌ పార్టీ ఆఫీస్ లో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జూలై 8న అత్యంత ఘనంగా కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన, ఈ సదర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, నిర్వహణ తదితర విషయాలపై ఈ సన్నాహాక సమావేశంలో చర్చించారు. పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడహక్ కమిటీలను కూడా షర్మిల ఇవాళ ప్రకటించారు., షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు “వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)”గా నిన్ననే ఆపార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న వైఎస్ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటిస్తారు.పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ ఇప్పటికే లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా, తెలంగాణ పాలిటిక్స్‌లో అరంగేట్రం షురూ చేసిన వైయస్ షర్మిల రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా షర్మిల వాడి వేడి విమర్శల బాణాలు సైతం వదులుతున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రైతుల వెతలు తదితర అంశాల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు షర్మిల.
మాజీ మంత్రి ఈటల త్వరలో బీజేపీలో చేరుతాంరటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. మాజీ మంత్రిఈటల రాజేందర్ వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో బుధవారం షర్మిల సమావేశం నిర్వహించారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అన్నారు షర్మిల.కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని షర్మిల పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో తమ పార్టీలో ఎటువంటి చర్చ లేదని చెప్పారు.రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందన్నారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై ప్రచారాన్ని ఆమె ఖండించారు. అదంతా ఫూలిష్ ప్రచారం జరుగుతోందన్నారు షర్మిల. ఇప్పటి వరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పార్టీ విధి,విధానాలు రూపొందిస్తామన్నారు. ప్రజల అజెండాను తమ పార్టీ అజెండా అన్నారు.

Related Posts