YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అరకోటి దాటుతున్న వాహానాలు

అరకోటి దాటుతున్న వాహానాలు

పెట్రోల్‌ ధరలు ఆకాశాన్నం టుతుండటంతో నాలుగు చక్రాల వాహనదారులు గ్యాస్‌ వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. మహా నగరంలో వాహనాల సంఖ్య  అక్షరాల అర కోటి దాటింది. ఇందులో 20 లక్షల వరకు మూడు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం 1.40 లక్షల వాహనాలు సీన్‌జీ,ఆటో గ్యాస్,లిక్విడ్, ఎల్పీజీ  గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి.  ఆటో గ్యాస్, లిక్విడ్‌ గ్యాస్‌కు కొరత లేనప్పటికీ సీ«ఎన్‌జీ గ్యాస్‌ సరైన సరఫరా లేకుండా పోయింది. సాధారణంగా గ్యాస్‌ స్టేషన్లకు  ప్రతి రోజు 5000 ఆటోలు, 1000 వరకు నాలుగు చక్రాల వాహనాల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్‌ సామర్ధ్యం నాలుగున్నర కిలోలు కాగా నాలుగు కిలోల వరకు,  కార్ల సామర్ధ్యం పది కిలోలు ఎనిమిది కిలోల వరకు  గ్యాస్‌ను నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతి రో జూ  6వేల కిలోవరకు గ్యాస్‌  డిమాండ్‌ ఉంటుం ది. ప్రస్తుతం  గ్యాస్‌ ధర నిలకడగా ఉండటం. రోజువారి సవరణ దీనికి వర్తించకపోవడంతో  గ్యాస్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటుండగా మరి కొందరు అనధికారికంగా మార్పిడి చేసుకుంటున్నారు.  దీంతో  హైదరాబాద్‌ మహా నగరంలో నేచురల్, లిక్విడ్‌ గ్యాస్‌కు డిమాండ్‌ పెరుగుతోంది.పెట్రోల్, డీజిల్‌తో పొలిస్తే ధర తక్కువగా ఉండటమేగాక మైలేజీ అధికంగా వస్తుండటంతో గ్యాస్‌ వినియోగానికి డిమాండ్‌ పెరుగుతోంది. రోజువారి సవరణలతో పెట్రోల్, డీసెల్‌ ధరలు అదుపు తప్పడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్‌ బంకులతోపాటు ఆటో గ్యాస్, సీఎన్‌జీ, లిక్విడ్‌ గ్యాస్‌ కేంద్రాలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా 460 పైగా పెట్రోల్‌ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్‌ పంపులు కూడా కొనసాగుతున్నాయి. మరో ఇరవై ఐదు కేంద్రాలో నేచురల్‌ గ్యాస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. మూడు ప్రధాన ఆయిల్‌  కంపెనీలకు చెందిన బంకులతోపాటు   టోటల్, రిలయన్స్‌ బంకుల్లో సైతం గ్యాస్‌ విక్రయిస్తున్నారు. 

Related Posts