గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు పత్రాలు, సోఫా, టీవీ, ఏసీ, కంప్యూటర్ ఇతర గృహాపకరణలు కాలి బూడిదయ్యాయి. వంశీ కార్యాలయం పక్కనే ఉండే విశ్రాంతి గదిలో మంగళవారం రాత్రి వైరింగ్ పనులు జరిగాయి. ఆ తరువాత కొద్దిసేపటికే విద్యుదాఘాతంతో ఆ గదిలో మంటలు చెలరేగి ఒక్కసారిగా అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొనే లోపే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే పర్యటనలో ఉండగా.. ప్రమాదం విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.