YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మమత రీవెంజ్ మాములుగా లేదుగా

మమత రీవెంజ్ మాములుగా లేదుగా

బెంగాల్, జూన్ 10, 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పీడ్ పెంచారు. బీజేపీని బెంగాల్ లో కట్టడి చేసే పనిలో పడ్డారు. బీజేపీకి భవిష్యత్ లో బెంగాల్ లో చోటులేదని చెప్పనున్నారు. పశ్చిమ బెంగాల్ లో మూడో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మమత బెనర్జీలో అనేక మార్పులు కన్పిస్తున్నాయి. ప్రధానంగా ఆమె పగతో రగలి పోతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి తాను అనుభవించిన మానసిక క్షోభకు మమత బెనర్జీ బదులు తీర్చుకోవాలనుకుంటున్నారు.అందుకోసమే బెంగాల్ లో బీజేపీ పని పట్టాలని నిర్ణయించుకున్నారు. బెంగాల్ లో బీజేపీని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో మమత బెనర్జీ ఉన్నారు. ఎన్నికలకు ముందు అనేక మంది టీఎంసీ నేతలను బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. సువేందు అధికారి వంటి నమ్మకమైన నేతను కూడా బీజేపీ తన్నుకుపోయింది. తనను మానసిక క్షోభకు గురిచేసిన బీజేపీ రివెంజ్ తీర్చుకోవడానికి మమత బెనర్జీ సిద్ధమయ్యారు.ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు తిరిగి టీఎంసీ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరందరికీ మమత బెనర్జీ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. తిరిగి పార్టీలో వారిని చేర్చుకోవడం ద్వారా తాను తప్ప మరో దిక్కు లేదని పార్టీ నేతలకు మమత బెనర్జీ బలమైన సంకేతాలు పంపనున్నారు. అలాగే బీజేపీని కూడా బలహీనం చేసే ప్రయత్నం చేయాలని మమత బెనర్జీ నిర్ణయించారు. త్వరలోనే బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో తిరిగి టీఎంసీ వైపు నేతలు వస్తారని తెలుస్తోంది.ఇక తనను కాదని వెళ్లి తనను ఓడించిన సువేందు అధికారిపై కూడా మమత బెనర్జీ పగ తీర్చుకుంటున్నారు. ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారిపై కేసు నమోదయింది. ప్రభుత్వ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి లక్షలు విలువ చేసే సామగ్రిని దోచుకుని వెళ్లారని సువేందు అధికారిపై కేసు నమోదు కావడం విశేషం. మమత బెనర్జీ రివెంజ్ పాలిటిక్స్ కు తెరతీశారని అర్థమవుతోంది. ఇక వరస పెట్టి తనను ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టిన వారిపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయని మమత బెనర్జీ పరోక్షంగా సంకేతాలను పంపారు.

Related Posts