" ఓం నమో నారాయణాయ "
" శ్రీమతే రామానుజాయ నమః "
" ఆచార్యుల అనుగ్రహాభాషణం గా "
" ప్రపన్నుని అవసాన కాలమునందు కాలమేఘ పెరుమాళ్ వచ్చి ఈ జీవుని చిటికిన వ్రేలు పట్టుకొని సూర్య మండలం ద్వారా ప్రవేశించి , చంద్రలోకం మొదలు పన్నెండు లోకములు త్రిప్పి విరజ లో స్నానమాడించి , అమానవకార స్పర్శ చేయించి పరమాత్మ వంటి స్వరూపం వచ్చిన తరువాత ఐదువందలు అప్సరస లచే అనేక రకాలుగా అలంకారం చేయించి, గరుడ వాహనం పై వైకుంఠమంతా చూపించి ఆది శేషుని పురుష కారం గా స్వామి తన ఒడిని చేర్చుకొని , అమితమైన ఆనందాన్ని పొందుతాడు,
" అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయు0చితే కలిగే ఫలం ఇది, ఇంకా వివరణ కావాలి అనుకున్నవారు, " ప్రమేయ శేఖరం " అర్చిరాది మార్గం అను గ్రంధములలో విపులంగా తెలుపబడింది.
" యధా సర్వేషు వేదేషు నాస్తి నారాయణాథ్పరః తథా సర్వేషు మంత్రేషు నాస్తి చాష్టాక్షరాథ్పరః భ్యథ్ఊర్ధ్వ బాహు రధ్యాత్ర సత్యపూర్వం బ్రలీమతః ,
" హే పుత్ర శిష్యా శృణుత నమంత్రోష్టాక్షరాత్పరః , సర్వ వేదాంత సారార్ధ స్సంసారార్ణవ తారకః , గతిరష్టాక్షరో నృణామ పునర్జన్మ కాంక్షిణాం "
" ఆర్తా విషణ్ణణ శిథిలాశ్చ భీతాఘోరేషు చ వర్తమానాః, సంకీర్థ్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాసుఖినో భవంతి "
*అష్టాక్షరీ మంత్రం శబ్దోచ్చారణ తో ఆ శ్రీమన్నారాయణ సదా మనందరిని రక్షిస్తాడు*
జై శ్రీ మన్నారాయణ