చాంద్రమానం ప్రకారం చైత్ర .. వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు ... పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది.
పితృదేవతల రుణం తీర్చుకోవడానికీ ... పాపాలను పరిహరించుకోవడానికి దైవసేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి.
పార్వతీదేవి ఆచరించిన *'రంభావ్రతం'* ...
వివాహిత స్త్రీలు ఆచరించే *'అరణ్యగౌరీ వ్రతం'* ..
గంగానది స్నానంతో పదిరకాల పాపాలను హరించే *'దశాపాపహర దశమి'*
*'త్రివిక్రమ ఏకాదశి'* పేరుతో పిలవబడే *'నిర్జల ఏకాదశి'* భక్తకోటిపై తమ ప్రభావం చూపుతుంటాయి.
అలాగే సూర్యుడిని ఆరాధించే *'మిథున సంక్రమణం'*
వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే *'ఏరువాక పున్నమి'* ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి.
దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే *'జ్యేష్ఠ పౌర్ణమి'*
శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే *'యోగిని ఏకాదశి'* ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
ఈ మాసంలో విష్ణువుని స్మరిస్తూ నీటి కుంభం విసనకఱ్ఱ చందనాన్ని దానం చేయాలి
ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను ... మరెన్నో విశేషాలను సంతరించుకుని , పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ వుంటుంది-
జై శ్రీమన్నారాయణ