YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గిన్నీస్ బుక్స్ లోకి ఔటర్ రింగ్ రోడ్

గిన్నీస్ బుక్స్ లోకి ఔటర్ రింగ్ రోడ్

నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్ త్వరలోనే గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కనున్నది. అందుకు హెచ్‌ఎండిఎ అధికారులకు గిన్నిస్ బుక్ రికార్డుల ప్రతి నిధుల నుండి సమాచారం వచ్చినట్టు తెలిసింది. ప్రపంచంలో ఏ మహానగరం చుట్టూర కూడా పూర్తిగా రింగ్ ఆకారంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ వే లేదని, ఓఆర్‌ఆర్ పొడవు 158 కి.మీ.లుగా లేదని హెచ్‌ఎండిఎ కార్యాలయంలో ప్రచారం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 8 వరుసలతో 158 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారి. ఈ రింగ్ రోడ్డు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా రూ. 6,696 కోట్ల వ్యయంతో నిర్మించారు. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ రూ. 3.123 కోట్లు సహాయం చేసింది.గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా ఈ రహదారి రూపొందించారు. ఈ రహదారిలోని పెద్ద రోడ్  124 కిలోమీటర్ల మేర హైటెక్ సిటీ, నానక్ రాం గూడా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐకెపి నాలెడ్జ్ పార్క్, హార్డ్వేర్ పార్క్, తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ, సింగపూర్ ఫైనాన్షియల్ జిల్లా మరియు గేమ్స్ గ్రామంల మీదుగా వెలుతుంది. ఇది 2012 డిసెంబరులో ప్రారంభించారు.ఔటర్ రింగు రోడ్డు 44, 65, 161, 163 మరియు 765 మొదలైన జాతీయ రహదారులను కలుపుతుంది. దీనివల్ల నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ వంటి నగరాలనుండి జాతీయ రహదారి 44 ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణించే సమయం తగ్గుతుంది.ఈ విషయమై గిన్నిస్ రికార్డులకు సంబంధించిన ప్రతినిధులు అథారిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. 8 లేన్‌లుగా, గంటకు 120 కి.మీ.ల వేగంతో డిజైన్ చేసిన ఎక్స్‌ప్రెస్‌వే మరి ఏ దేశంలోనూ లేదనే అభిప్రాయాన్ని గిన్నిస్ బుక్ రికార్డుల వారు ప్రస్తావించినట్టు తెలిసింది. ఔటర్ ఎక్స్‌ప్రెస్‌వేకున్నట్టుగా ఇరువైపుల రెండు సర్వీసు రోడ్లు, కేవలం కూడళ్ళలోనే ప్రవేశించడంగానీ, దిగిపోవడం గానీ ప్రపంచంలోని ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలకు లేదని ఉన్నతస్థాయి అధికారులు కూడా వెల్లడి స్తున్నారు. బీజింగ్ నగరానికి ఉన్న రింగ్ రోడ్లలో 3వది 48 కి.మీ.లు, 4వ ది 65 కి.మీ.లుగా ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రష్యాలోని పీటర్స్ బర్గ్‌లోని రింగ్‌రోడ్ 147 కి.మీ.లుగానూ, దక్షిణాఫ్రికాలోని జోహన్నె స్‌బర్గ్‌లో రింగ్ రోడ్ పొడవు 80 కి.మీ.లుగా ఉన్నదని, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం రింగ్ రోడ్ 70 కి.మీ.లు, ఇటలీ రాజధాని రోమ్ రింగ్ రోడ్ 68 కి.మీ.లుగా ఉన్నట్టు హెచ్‌ఎండిఎ అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 158 కి.మీ.లు పొడవు, నగరం చుట్టూర ఓ రింగ్ వలె ఉండటం కూడా విశిష్టతగానే ఉన్నందను గిన్నిష్‌బుక్‌లో రికార్డు చోటు సంపాదించడం ఖాయంగా ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

Related Posts