చెన్నై
ప్రముఖ సంగీత విద్వాంసులు ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంతకుముందే ఆయనకు కరోనా సోకగా, రెండు రోజు క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చింది రత్నకుమార్ డబ్బిండ్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు.తండ్రి బాటలో పయనించకుండా వేరే దారిని ఎంచుకున్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఘంటసాల వెంకటేశ్వరరావు దంపతులకు ఆరుగురు సంతానం కాగా, అందులో ముగ్గురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో రత్నకుమార్ రెండోవారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు . హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు ఆయన ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవారు. ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ వంటి సినిమాలకు మాటలు కూడా అందించారు