YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిద్ధిపేట లో మంత్రి హరీశ్ రావు మార్నింగ్ వాక్ - ఓపెన్ టాప్ జీపులో సెల్ఫ్ డ్రైవింగ్

సిద్ధిపేట లో మంత్రి హరీశ్ రావు మార్నింగ్ వాక్ - ఓపెన్ టాప్ జీపులో సెల్ఫ్ డ్రైవింగ్

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో మంత్రి హరీశ్ రావు మంగళవారం నాడు మార్నింగ్ వాక్ చేసారు. ఈ సందర్బంగా అయన సిద్ధిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారిక బృందంతో కలిసి పట్టణ పురోగతి పనులపై అక్కడికక్కడే సమీక్షించారు. సిద్ధిపేటలోని  మంత్రి నివాసం నుంచి ప్రారంభమైన ఓపెన్ టాప్ జీపు జర్నీ పట్టణంలోని పాత బస్టాండు- అంబేద్కర్ సర్కిల్ మీదుగా హైదరాబాదు రోడ్డు వెంబడి పొన్నాల వరకూ ఉన్న చెట్లు, ఆ రోడ్డు మార్గం మీదుగా కాలనీలకు వెళ్లే దారిలో  గల్లీలు, ఆ గల్లీలలో వచ్చే భూ గర్భ డ్రైనేజీ పనులు చేపడుతున్న విధాన తీరుతెన్నులపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆ తర్వాత తిరిగి అదే రోడ్డు మార్గంలో యూ టర్న్ తీసుకుని మళ్లీ పాత బస్టాండు వరకూ పయనించారు. అక్కడి నుంచి పాత బస్టాండు-అంబేద్కర్ సర్కిల్ మీదుగా రూరల్ పోలీసు స్టేషన్ - సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వరకూ దాదాపు 3కిలో మీటర్ల దూరంలోని మెయిన్ రోడ్ అనుకుని ఉన్న ప్రతీ గల్లీలను కౌంట్ చేస్తునే.., ఆయా ప్రాంతాలలోని భూ గర్భ డ్రైనేజీ పనుల పై అధికారులతో కలిసి ఆరా తీశారు.

Related Posts