YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

చొక్సీకి బిగిస్తున్న ఉచ్చు

చొక్సీకి బిగిస్తున్న ఉచ్చు

న్యూఢిల్లీ, జూన్ 11, 
పంజాబ్ నేష‌నల్ బ్యాంక్ కుంభ‌కోణం నిందితుడు, వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. డొమినికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చోక్సీని అక్రమ వలస దారుల జాబితాలో చేరుస్తూ డొమినికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో బ్యాంకులకు 13 వేల 500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన చోక్సీ… ప్రస్తుతం డొమినికా పోలీసుల అదుపులో ఉన్నారు. తనను కిడ్నాప్‌ చేశారంటూ ఇప్పటికే ఆంటిగ్వా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.తాను చ‌ట్టాన్ని గౌర‌వించే వ్యక్తిన‌ంటూ డొమినికా హైకోర్టులో అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేశారు. అమెరికాలో చికిత్స కోస‌మే తాను ఇండియా విడిచిపెట్టాన‌ంటూ అఫిడవిట్‌లో చెప్పారు. అయితే చోక్సీ చెప్పినవన్నీ కట్టుకధలనీ డొమినికా ప్రభుత్వం గుర్తించింది. చోక్సీని అక్రమ వలస దారుల జాబితా చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ డొమినికా ప్రభుత్వం కేసు కూడా ఫైల్‌ చేసిందియాంటిగాలో పౌరసత్వం కోసం మెహుల్‌ చోక్సీ దరఖాస్తు చేసుకున్న సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆదేశ సమాచార శాఖ మంత్రి మేల్‌ఫోర్ట్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. క్రిమినల్ కేసులు లేవని పత్రాలు సమర్పించారని చెప్పారు. చోక్సీ దరఖాస్తు సమయంలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు కూడా దర్యాప్తు ఏజెన్సీల విచారణలో లేదన్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కేసుల అంశం వెలుగులోకి రావడంతో పౌరసత్వం కోసం తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో యాంటిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇక ఛోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 13,500 కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయారు. 2018 నుంచి చోక్సీ యాంటీగాలో ఉంటున్నారు. ప్రస్తుతం డొమినికాలో ఉన్న చోక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి

Related Posts