న్యూయార్క్, జూన్ 11,
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రజల జీవన పరిస్థితులను వణికిస్తున్నాయి, కోవిడ్ ఇచ్చిన షాక్ తో ప్రపంచ మంతటా ఆర్థిక వ్యవస్థలు సర్వనాశనం అయినప్పటికీ, అణు సాయుధ దేశాలు మాత్రం అణు ఆయుధాలపై పెడుతున్న ఖర్చులను గత ఒక్క సంవత్సరం లోనే 1.4 బిలియన్ డాలర్లకి పెంచా యి. అణ్వాయుధాలను రద్దు చేయాలన్న అంతర్జాతీయ ప్రచారం సంస్థ 2017 లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న ఐకాన్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఒక తాజా నివేదికలో ప్రపంచంలోని తొమ్మిది అణ్వాయుధ సాయుధ దేశాలు అణ్వాయుధాలపై తమ ఖర్చును ఏ విధంగా పెంచేసాయో వివరిం చాయిఎన్నో దేశాలలో ఆసుపత్రి పడకలు రోగులతో నిండి ఉన్నాయి, వైద్యులు మరియు నర్సులు రేయింబగళ్లు పనిచేస్తున్నారు, ఎన్నో చోట్ల ప్రాథమిక వైద్య సామాగ్రి కొరతగా ఉంది, కానీ తొమ్మిది దేశాలు మాత్రం తమ సామూహిక విధ్వంస ఆయుధాల కోసం 72 బిలియన్ డాలర్లకు పైగా నిధుల్ని కేటాయించి అవి ఖర్చుపెట్టటానికి సిద్ధంగా చేతిలో ఉన్నాయి " అని నివేదిక తెలిపింది. ఇది 2019 లో ఆ ఆ దేశాలలో ఖర్చు పెట్టిన నిధుల కంటే కనీసం 1.4 బిలియన్ ఎక్కువ.యుఎస్ గత సంవత్సరం మొత్తం నిధులలో నుండి 37.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అంటే అది గత సంవత్సరం మొత్తం సైనిక వ్యయం కోసం కేటాయించిన నిధులలో 5% అని ఐకాన్ నివేదిక పేర్కొంది. అంచనా ప్రకారం చైనా 10 బిలియన్ డాలర్లు మరియు రష్యా 8.0 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
కొన్ని దేశాలని సంయుక్తంగా తీసుకున్నప్పుడు, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, ఇస్రాయెల్, పాకిస్తాన్ మరియు ఉత్తర కొరియాతో సహా అణు సాయుధ రాష్ట్రాలు కేవలం 2020 లో మాత్రమే ప్రతి నిమిషానికి 1,37,000 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేశాయి, ఇది "ఈ తొమ్మిది దేశాలు సామూహిక విధ్వంసం ఆయుధాలపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తూ వ్యర్థం చేస్తుంటే, మిగతా ప్రపంచం మాత్రం వాటిని చట్టవిరుద్ధం చేయడంలో బిజీగా ఉంది "అని తెలిపింది.: 2020 ప్రపంచ అణు వ్యయం రక్షణ కాంట్రాక్టర్లకు పన్ను డబ్బును ఛానలైస్ చేయడాన్ని హైలైట్ చేసింది, వారు లాబీయి స్టులను ప్రోత్సహించటంపై ఎక్కువ మొత్తాలను ఖర్చు చేయబోతున్నారుప్రస్తుత లేదా కొత్త ఒప్పందాల ద్వారా గత ఏడాది వ్యాపారం నుండి లాభం పొందిన 20 కి పైగా కంపెనీలు, 11 పాశ్చాత్య కంపెనీలు నార్త్రాప్ గ్రుమ్మన్, జనరల్ డైనమిక్స్, లాక్‌హీడ్ మార్టిన్, రేథియోన్ టెక్నాలజీస్ మరియు డ్రేపర్మా లాంటి కంపెనీలు కొత్త లేదా సవరించిన అణ్వాయుధ ఒప్పందాలలో 27.7 బిలియన్ డాలర్లు సంపాదించాయి.