కర్నూలు, సర్పంచులను అవమానిస్తున్నారు ఒక వైపు కరోనా, మరో వైపు పారిశుధ్యం, చీకటిలో గ్రామాలు సర్పంచులసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రా చారి ప్రశ్న :
గ్రామ పంచాయతీ లకు ఎన్నికలు జరిగి మూడు నెలలు పూర్తయినా ప్రభుత్వం సర్పంచులకు పూర్తిస్థాయి పాలనకై చెక్ పవర్ నేటివరకు బదలాయించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలచేత నేరుగా ఎన్నిక కాబడ్డ సర్పంచులను అనుమానిస్తూ, అవమానానికి గురిచేస్తుందని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి.వీరభద్రాచారి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎన్నికలు జరిగి నూతనపాలక వర్గాల ప్రజాపాలన మొదలైందన్న పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఇంకా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందని, ఇదిముమ్మాటికి పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పాలనా వైఫల్యంగా భావించాలని వీరభద్రా చారి అభి ప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ లలో నిధుల ఖర్చుకు అవకాశంలేకుండా ట్రెజరీ ఆంక్షలు పెట్టి, నిరంతరం పారిశుధ్యం కోసం ఈ నెల ఎనిమిది నుండి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం విడ్డురంగా ఉన్నదన్నారు. ఇప్పటికే సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వ, మరియు పంచాయతీ నిధులు పై ఆధారపడకుండా స్వంత నిధులతో తర్వాత డ్రా చేసుకోవచ్చన్న నమ్మకంతో లక్షల రూపాయలు ప్రజలశోకర్యంకోసం, అధికారులు చెప్పారన్న పరిస్థితుల్లో ఖర్చు చేశారని అన్నారు. అవి ఎలా రాబట్టుకోవాలో కూడా అధికారులనుండి సమాధానం లేక సతమతమవుతున్నారని అన్నారు. పంచాయతీ ల ప్రతిష్ట, సర్పంచ్ మరియు పాలక వర్గాల గౌరవాన్ని తద్వారా మెరుగైన పాలన గ్రామస్థాయిలో జరగడానికి ప్రభుత్వం వెంటనే చెక్ పవర్ సర్పంచ్ కు బదలాయించేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించాలని కోరారు. ఒకవైపు కరోనా, పారిశుధ్యం, మరోవైపు వేసవి మంచినీటిఎద్దడి, వీధిదీపాల మరమ్మతులులేక అంధకారంలో వీధులు లాంటి అనేకసమస్యలతో గ్రామాలు నిధులులేక, ఉన్ననిధులు వినియోగించుకోలేక నూతన ఉత్సాహంతో పదవీ భాద్యతలు చేపట్టిన పాలక వర్గాల కు నిరుత్సాహం మిగులుతుందన్నారు.తక్షణమే తగు చర్యలద్వారా పంచాయతీ రాజ్ మంత్రి సమస్యను పరి
ష్కరించాలని వీరభద్రాచారి విజ్ఞప్తి చేశారు.