YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీ లో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం

ఢిల్లీ లో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం

న్యూఢిల్లీ జూన్ 11
దేశ రాజధానిలో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వాహనాలు వేగంగా వెళ్లకుండా ఆయా మార్గాల్లో పరిమితులు విధించింది. పరిమితికి మించి వేగంగా నడిపితే భారీగా జరిమానాలు విధించనున్నారు. ఢిల్లీలో చాలా రోడ్లపై కారు గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా వేగ పరిమితిని నిర్ణయించింది. ద్విచక్ర వాహనాలకు గంటకు 50-60, నివాస.. వాణిజ్య మార్కెట్ల లోపల అన్ని రోడ్లపై కార్లు, బైకులు గరిష్ఠ వేగ పరిమితి గంటకు 30 కిలోమీటర్లుగా నిర్ణయించింది.బస్సులు, టెంపోలు, మూడు చక్రాల వాహనాల గరిష్ఠ పరిమితిని గంటకు 40 కిలోమీటర్లుగా ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎన్‌డీ (ఢిల్లీ నోయిడా డైరెక్ట్‌)లో కార్ల వేగ పరిమితిని గంటకు 70 కి.మీ, ద్విచక్ర వాహనాల స్పీడ్‌ 60 కి.మీ, బార్పులా ఫ్లై ఓవర్‌లో కార్లు, ద్విచక్ర వాహనాల గరిష్ఠ వేగాన్ని గంటకు 60 కిలోమీటర్లుగా నిర్ణయించింది

Related Posts