న్యూఢిల్లీ, జూన్ 11
ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ప్రయోజనాలను పొందాలంటే తమ యూఏఎన్ నంబర్‌కు ఆధార్‌కార్డు సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానించాలి. లేదంటే యజమాని వాటా సంబంధిత ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ కాదని అధికారులు తెలిపారు. ఈ కొత్త నిబంధన ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఆన్‌లైన్ సేవలను ప్రోత్సహిస్తున్నామని వారు చెప్పారు. ఖాతాదారుడిని గుర్తించడానికి ఆధార్‌కార్డు నంబర్‌ను అనుసంధానించాలని కోరుతున్నామని తెలిపారు.