YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా, తయారుచేసినా ఉపేక్షించేది లేదు

నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా, తయారుచేసినా ఉపేక్షించేది లేదు

నిజామాబాద్, జూన్ 11,   ఎరువులు విత్తనాల సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి రైతుబంధు కింద  సంవత్సరానికి 14 వేల కోట్లు ---వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి.
నకిలీ విత్తనాల  విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఎవరిని కూడా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి  కేసీఆర్  ఆదేశించారని, నకిలీ విత్తనాలు తయారుచేసినా, అమ్మినా, సరఫరా చేసినా అటువంటి వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసు, వ్యవసాయ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నాడు కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో వానకాలం సాగుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి  ఇప్పటికే ఆదేశించారని వ్యవసాయానికి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం గత ఏడు సంవత్సరాలుగా పరిపాలనలో తీసుకున్న పలు సాహసోపేత చర్యలవల్ల అర్థమవుతుందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న వారికి సరైన సమాధానం ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రి రైతు ప్రయోజనాలకు పలు కార్యక్రమాలు అమలు చేయడమే నిదర్శనమని తద్వారా రైతు కుటుంబాలలో ఒకరికి బదులు కుటుంబ సభ్యులు అందరూ కూడా వ్యవసాయం చేస్తూ ఇంటిల్లిపాది  ఆనందంగా, గర్వంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు కావాల్సిన అన్ని సలహాలు సూచనలు అందిస్తూ బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు.
రైతులు  సొంత ఖర్చుతో 50 లక్షల ఎకరాలకు నీటిని పారించుకోవడానికి 22 లక్షల బోర్లు వేసుకున్నారని వాటిల్లో గ్రౌండ్ వాటర్ ఉండేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులలో పూడికతీత పనులు చేపట్టడం ద్వారా బోర్లలోకి నీరు వచ్చిందని అంతేకాక వాగుల్లో చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టడం ద్వారా కూడా బోర్ లలో గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు. ఆ బోర్లను విద్యుత్ సమస్య లేకుండా నడిపించు కోవడానికి తెలంగాణ ప్రభుత్వం 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యుత్తు సరఫరాతో పాటు కొత్త సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు లైన్లు ఏర్పాటు చేసిందని వివరించారు. ప్రభుత్వం  నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తుందని ఎవరు కూడా ఊహించలేదని తెలిపారు. దీనికితోడు రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు సకాలంలో అందించడానికి డిమాండ్ లేని సమయంలో వాటిని అడ్వాన్స్ గా సేకరించడం ద్వారా రైతులకు సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగు చేసుకుంటున్నారని అన్నారు. అంతేకాక గతంలో కల్తీ విత్తనాలతో రైతులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడంతో ప్రభుత్వం ఆ దిశగా  చర్యలు చేపట్టి చాలా వరకు సమస్యలు లేకుండా చూసుకున్నది అన్నారు.
దానితో సరిపెట్టుకోకుండా ప్రపంచంలో  ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సహాయం కింద ఎకరాకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు అందించడం ద్వారా సంవత్సరానికి రైతులకు 14 వేల కోట్ల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు.  గత రెండు సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలుకు అధికారులు చేస్తున్న కృషి  ఎంతైనా అభినందనీయమని వ్యవసాయ సివిల్ సప్లైస్ పోలీస్ రెవెన్యూ రవాణా శాఖల అధికారులు పెద్ద ఎత్తున రైతుల నుండి ధాన్యం సేకరించి వారికి ఎంఆర్పి చెల్లించడంతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేయడానికి కృషి చేశారని తద్వారా రైతులకు భరోసా కల్పించామని అన్నారు. కరోనా వల్ల ఇతర రాష్ట్రాల్లో కేవలం మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యాన్ని మాత్రమే సేకరించారని కానీ కరోనా మహమ్మారి ఇ సమయం లో కూడా ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించి రైతుకు గౌరవం తో పాటు భరోసా కల్పించడం జరిగిందన్నారు.  విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు నాణ్యమైనవి అందించిన రికార్డు మనకు ఉండదని ఇకముందు కూడా రైతుకు అండగా నిలబడే విధంగా అధికారులు కలిసికట్టుగా పనిచేసి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా మోసం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ వానా కాలంలో 5 లక్షల 7 వేల 800 ఎకరాల సాగు అంచనాకు గాను 77 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని ఇందులో 24, 350 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉన్నదని అదేవిధంగా డి ఏ పి 16610 ఎం.టి. అవసరం కాగా 1897 బఫర్ వున్నదని ఎం వో పి పదివేల 402 కు గాను 2722 నిల్వ ఉన్నదని కాంప్లెక్స్ 33878 మెట్రిక్ టన్నులు అవసరం అయితే అందులో లో 21, 415 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండదని వివరించారు. విత్తనాలు సరిపోయినంత గా మన దగ్గర  అందుబాటులో ఉన్నాయని ఆ సమస్య లేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  పర్యవేక్షణలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిరోజు సమీక్షలు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని రైతుకు ఇబ్బంది కలిగితే కెసిఆర్ దోచుకుంటున్నారని  వ్యవసాయంలో నంబర్ వన్ స్థానంలో ఎలా ఉన్నాము దానిని కొనసాగించాలని  కల్తీ లేని విత్తనాలను రైతులకు అందించాలని  ఆయన ఆదేశించారు.

Related Posts