YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెంకన్న సన్నిధిలో మంత్రులు

వెంకన్న సన్నిధిలో మంత్రులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కళా వెంకట్రావు,  అయ్యన్నపాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, కెఎస్ జవహర్, ఎంపీలు మురళీ మోహన్, మాగంటి బాబు   దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో చేపట్టిన ధర్మ పోరాటదీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు  అన్నారు. నరేంద్ర మోదీ గతంలో తిరుమలేశుని పాదాల చెంత ఇచ్చిన వాగ్దానాలు ప్రధానికి మళ్ళీ గుర్తుకు తెచ్చే విధంగా సభ జరిగిందని మంత్రులు అన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టిన ధర్మ పోరాటదీక్షను ప్రజలే విజయవంతం చేశారని అన్నారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక లోటులో ఉంది కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందటం లేదని వాపోయారు. ఈ సంవత్సరం రాష్ట్రానికి చాలా కీలకమైనది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. మన రాష్ట్రంలో బీజేపీ నాయకులు గుజరాత్ బీజేపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారని మంత్రి జవహర్ అన్నారు. వర్షం పడితే ప్రకృతి వైపరీత్యంగా మార్చేంత దిగజారుడు రాజకీయాలు బీజేపీ నాయకులు చేస్తున్నారని మంత్రులు అన్నారు. 

Related Posts