YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

10 ఏళ్ల పాటు నిరీక్షణే కలిసొచ్చింది

10 ఏళ్ల పాటు నిరీక్షణే కలిసొచ్చింది

విజయవాడ, జూన్ 12, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలోనూ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే అప్పుడు లేని ఫ్రస్టేషన్ చంద్రబాబు లో ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తుంది. చంద్రబాబు అధికారాన్ని కోల్పోవడం కొత్తేమీ కాదు. 2004 నుంచి 2014 వరకూ దాదాపు పదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షనేతగానే వ్యవహరించారు. అప్పుడు ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. అప్పట్లో అధికార పక్షం మీద విమర్శలు చేసినా ఆయన తన అనుభవాన్ని ఉపయోగిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు.2004 లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలే చేశారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే అప్పుడు కూడా వైఎస్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో వైఎస్ జనంలోకి బాగా వెళ్లారని తెలిసినా చంద్రబాబు ఎప్పుడు ఫ్రస్టేషన్ కు గురికాలేదు. రెండోసారి వైఎస్ అధికారంలోకి వచ్చినా కూడా ఓటమిని చంద్రబాబు హుందాగా స్వీకరించారు.కానీ చంద్రబాబు ఇప్పుడు ఓటమిని అంగీకరంచడం లేదు. జగన్ చేతిలో ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ప్రజలనే తప్పు పడుతున్నారు. దీనికి కేవలం ఓటమి ఒక్కటే కారణం కాదు. చంద్రబాబుకు ఓటమి కొత్తేమీ కాదు. కాకుంటే వైఎస్ హయాంలోనూ, ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పాలనలో గాని చంద్రబాబు ఎటువంటి ఇబ్బందులు పడలేదు. తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకం చంద్రబాబు లో ఉండేది. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు పడలేదు.ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. చంద్రబాబు తట్టుకోలేకపోతుంది అదే. నేరుగా తనతో పాటు టీడీపీ అగ్రనేతల ఆర్థిక మూలాలను ఇప్పటికే జగన్ దెబ్బతీశారు. ఇది చంద్రబాబు ఫ్రస్టేషన్ కు కారణమంటున్నారు. 

Related Posts