YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కండ్లకోయ ఇంటర్ చేంజ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కండ్లకోయ ఇంటర్ చేంజ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మౌలిక వసతులు బాగుంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధ్యమని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  మంగళవారం ఉదయం  అయన  మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ కండ్లకోయ కూడలికి సంబంధించి న్యాయపర అడ్డంకులెదురైనా ఓఆర్ఆర్ పనులు పూర్తి చేశామన్నారు. రహదారులు, స్కైవే, పైవంతెనలు, అండర్ పాత్వేలు నిర్మిస్తున్నామన్నారు. మాట్లాడుతూ జైకా నిధులతో ఓఆర్ఆర్ పూర్తి చేశామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్  నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఎస్ఆర్డీపీ కింద అండర్పాస్లు నిర్మిస్తున్నామని చెప్పారు. స్కైవేల కోసం డిజైన్ల బడ్జెట్ కుడా సిద్ధంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపి మాల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుదిర్రెడ్డి, వివేక్, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, నరేంద్రర్ రెడ్డి, హెచ్ఎండిఎ కమిషనర్ చిరంజీవులు పాల్గోన్నారు.  కండ్లకోయ సెగ్మెంట్ ప్రారంభం కావడంతో పూర్తిస్థాయిలో ఓఆర్ఆర్ 158 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది.  కండ్లకోయ వద్ద 1.10 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎక్స్ప్రెస్వేను రూ. 125 కోట్ల వ్యయంతో నిర్మించారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ 158 కి.మీ పొడవుతో నిర్మించిన ఓఆర్ ఆర్  నిర్మాణం కోసం రూ.6,696 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 

Related Posts