YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

క్రూడ్ ఆయిల్ ధరలతో భగ్గుమంటున్న పెట్రోలు

క్రూడ్ ఆయిల్ ధరలతో భగ్గుమంటున్న పెట్రోలు

ముంబై, జూన్ 12, 
పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరలు బుధవారం కూడా పెరిగాయి. గత 35 రోజుల్లో 22 సార్లు వీటి ధరలను ఆయిల్‌‌  మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెట్రో రేట్లు పెరుగుతుండడంతో సరుకులను డెలివరీ చేసేవాళ్లు, క్యాబ్‌‌‌‌‌‌‌‌లు, ఆటోలను నడుపుకొని బతికే వాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోజువారి సంపాదనలో మూడో వంతు పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌కే పోతోందని వాపోతున్నారు. ఇలా వరసగా పెట్రో ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండడం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్స్‌‌లే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీ తిరిగి ఓపెన్ అవుతుడడంతో క్రూడ్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది. దీంతో ఇండియన్ మార్కెట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ రేట్లను పెంచుతున్నాయి. కాగా, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఐదు అంశాలపై ఆధారపడి ఉంది. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రూడాయిల్ ధర, డాలర్ మారకంలో రూపాయి రేటు, రిఫైనింగ్ ఖర్చు, ప్రభుత్వం విధించే ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు, కన్జూమర్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలు పెట్రో రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌  ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 73 డాలర్లను బుధవారం టచ్ చేసింది. ఈ ఏడాది బ్రెంట్ క్రూడాయిల్ ధర సగటున బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 62.26 డాలర్లుగా ఉంటుందని యూఎస్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ అంచనావేసింది. దీనర్ధం ఈ ఏడాది మొత్తం క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ ధరలు గరిష్టాల వద్దే కొనసాగుతాయని. మరోవైపు మిడిల్‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌లో రాజకీయ సంక్షోభం వస్తే క్రూడ్ ధరలు మరింత పెరుగుతాయి.కిందటేడాది డాలర్ మారకంలో రూపాయి రేటు సగటున 74.13 వద్ద ఉంది.  ఈ ఏడాది కూడా ఈ రేటు సగటున 75 వద్ద కొనసాగుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇది బుధవారం ఉన్న రేటు 72.97 కంటే రూ. 2 ఎక్కువ. డాలర్ మారకంలో రూపాయి బలహీనపడితే క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర  దిగుమతులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరల్లో 60 శాతం వాటా ప్రభుత్వాలకు ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ల ద్వారా వెళుతున్నాయి. ఇప్పట్లో ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లను తగ్గించడానికి రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే కరోనా వలన  ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కలెక్షన్‌‌‌‌‌‌‌‌ తగ్గింది. దీంతో పెట్రో ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై వచ్చే ఆదాయాన్ని  ప్రభుత్వాలు వదులుకునే అవకాశం ఇప్పట్లో అయితే లేదు. పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ను జీఎస్‌‌‌‌‌‌‌‌టీ పరిధిలోకి తెచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ట్యాక్స్ స్లాబ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.  పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌పై ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి దరిదాపుల్లో కూడా 28 శాతం స్లాబ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే ఆదాయం ఉండదు. కరోనా కేసులు తగ్గుతుండడంతో అన్‌‌‌‌‌‌‌‌లాక్ దేశంలో అన్‌‌‌‌‌‌‌‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో మరిన్ని వెహికల్స్‌‌‌‌‌‌‌‌ రోడ్ల పైకి వస్తాయి. డిమాండ్ పెరుగుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరలు మరింత పెరిగే అవకాశమే తప్ప తగ్గే ఛాన్స్ లేదు. రిఫైనింగ్ పరంగా చూస్తే ఇండియాలో తగినంత కెపాసిటీ ఉంది. దీంతో రిఫైనింగ్ ఖర్చులు ఇప్పట్లో పెరగవు. పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరలు పెరగడంలో దీని పాత్ర తక్కువని చెప్పాలి. పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరలు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ ప్రైస్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 10.49 శాతం ఎగిసింది. పెరుగుతున్న  పెట్రో రేట్లపై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శక్తికాంత దాస్‌‌‌‌‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేయడానికి ఇదొక కారణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లను తగ్గించాలని ఆయన కోరారు. పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లు పెరగడంతో సరుకులను, ఇతర గూడ్స్‌‌‌‌‌‌‌‌ను డెలివరీ చేసే ట్రక్కుల అద్దెలు పెరుగుతాయి. దీంతో ఇవి రవాణా చేసే ప్రతీ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ ధర పెరుగుతుంది. గూడ్స్‌‌‌‌‌‌‌‌ ధరలు ఈ నెలలో 10 శాతం మేర పెరుగుతాయని ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌  సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌పీ సింగ్‌‌‌‌‌‌‌‌ అంచనావేశారు

Related Posts