హైదరాబాద్, జూన్ 12,
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ .. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు అటు విమానాశ్రయంలోనూ.. ఇటు ఆయన బస చేసే రాజ్‌భవన్‌లోనూ స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వీఐపీలు తరలి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సిన వారే కాకుండా.. . అధికార బాధ్యతల్లో ఉన్న పలువురు మంత్రులు.. ఉన్నతాధికారులు తరలి వెళ్లారు. ఓ రకంగా మొత్తం అధికారవర్గంలో సీజేఐ ఎన్వీ రమణ రాక సందడి కనిపించింది. రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అయితే.. తెలుగు వ్యక్తి చాలా ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు సీజే అవడం… కారణంగా ఈ ఉత్సాహం కనిపించిందని అనుకోవచ్చు. అయితే.. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం చీఫ్ జస్టిస్ నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాలేదు. ఆయన మొదటగా ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ ఏపీలో ఎక్కడా హడావుడి కనిపించలేదు. ప్రోటోకాల్ ప్రకారం కూడా.. వీఐపీలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… సీజేఐ వచ్చే సమయానికంటే ముందుగానే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత అమరావతి వచ్చారు. రెండు చోట్ల ఆహ్వానాలు.. స్వాగతాలు రెండు రోజుల్లోనే జరగడంతోనే కంపేరిజన్ ఎక్కువగా వస్తోంది. ఈ విషయంలో ఎన్వీ రమణ సీజేఐగా ఖరారు కాక ముందు జరిగిన పరిణామాలను కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఎన్వీ రమణ సీజేఐ కాకుండా… ఓ వైపు జడ్జి రామకృష్ణ వైపు నుంచి ఆరోపణలు చేయించడానికి మరో వైపు.. స్వయంగా సీఎం జగన్ ఆరోపణలు చేస్తూ లేఖ రాయడాన్ని కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్‌కు ఇష్టం లేనందునే… తెలంగాణ స్థాయిలో స్వాగతాలు దక్కలేదని అంచనా వేస్తున్నారు.