YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీకి వార్నింగా...

గులాబీకి వార్నింగా...

హైదరాబాద్, జూన్ 12, 
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఏఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సోదాలు చేస్తోంది. నిజానికి ఇదే మొదటి సారి కాదు. గతంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు.. మరోసారి అదే కేసులో ఈడీ సోదాలు చేస్తోంది. కానీ ఈ సారి సోదాల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. దీనికి కారణం.. టైమింగ్. ఓ వైపు టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ నుంచి పార్టీలో చేర్చుకుంటున్న సమయంలో..ఇక టీఆర్ఎస్‌తో తమకు కయ్యమే కానీ.. స్నేహమే కాదని.. నిరూపించాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలోనే.. టీఆర్ఎస్ నేతను ఈడీ టార్గెట్ చేయడం… తెలంగాణ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఎంపీ నామా నాగేశ్వరరావు మధుకాన్ అనే గ్రూప్ కంపెనీలకు ఓనర్. ఆయన .. ఆయన కుటుంబసభ్యులు ఇందులో డైరక్టర్లుగాఉన్నారు. వివిధ వ్యాపారాలు చేసే ఆ సంస్థకు.. హైవేల నిర్మాణంలో అనుభవం ఉంది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ పొందింది.. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం అంటూ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని.. విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని గతంలోనే అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం రూ.264 కోట్లు దారి మళ్లించారని… రుణాలు తీసుకుని.. కూడా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయారు. దీనిపై రాంచీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరపాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించడంతో సీబీఐ దర్యాప్తు జరిపి.. నిధులు పక్కదారి పట్టాయని తేల్చింది. 2019లో సీబీఐ కేసు, 2020లో చార్జిషీట్ నమోదు చేశారు. నామాతో పాటు కంపెనీ డైరక్టర్లు, ఆడిటర్లను నిందితులుగా చేర్చారు. ఇప్పుడు అదే కేసులో ఈడీ సోదాలు ప్రారంభించింది. నిజానికి ఆ రుణాల కేసుల్లో ఇప్పుడు.. కొత్తగా సోదాలు చేస్తే దొరికే ఆధారాలేమీ ఉండవు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ.. సోదాలు చేస్తున్నారు.. అన్న హడావుడి .. మీడియాలో హైప్ కోసమే సోదాలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈటలతో ప్రారంభమయ్యే టీఆర్ఎస్ నేతల వలసలకు.. ఊపు రావాలంటే.. టీఆర్ఎస్‌తో బీజేపీకి సన్నిహిత సంబంధాలు లేవని.. బెంగాల్ లో తృణమూల్‌ను వేటాడిన తరహాలో వేటాడతామని.. తొలి సంకేతంగా నామాపై ఈడీ దాడులన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

Related Posts