YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఈటల తీవ్ర విమర్శలు

తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఈటల తీవ్ర విమర్శలు

హైదరాబాద్,  కరోనాపై సరైన చర్యలు తీసుకోలేదు  నేను ప్రజల మద్దతుతోనే గెలుస్తూ వస్తున్నాను.
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ శామీర్ పేట నుంచి హైదరాబాద్లోని గన్ పార్కుకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు.  స్పీకర్ ఫార్మెట్ లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
ఈటల వెంటే ఏనుగు రవీందర్రెడ్డి, తుల ఉమ ఉన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. తాను ప్రజల మద్దుతోనే ఇన్నాళ్లూ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నానని అన్నారు. కెసిఆర్ కుటుంబ ఫ్యూడల్ పాలనను అంతం చేయడమే నా ఎజెండా అని… ఇతర పార్టీల నుండి గెలిచినవారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారని అన్నారు.
'నేను 17 ఏళ్లు పాటు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ టీఆర్ఎస్ గెలుస్తోంది. నాలాంటి వారిపై ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ ఈ రోజు ఎలాంటి ధోర‌ణిని అవ‌లంబిస్తుందో ప్ర‌జ‌లు, తెలంగాణ‌ ఉద్య‌కారులు గ‌మ‌నించాలి. హుజూరాబాద్ లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక వంటిది. ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుంటార‌ని ఆశిస్తున్నాను. న‌న్ను నిండు మ‌న‌సుతో హుజూరాబాద్ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించారు. తెలంగాణ ప్ర‌జ‌లు, రైతులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌ట్లేదు. అలాంటి వారికి గ‌ట్టిగా బుద్ధి చెప్పాలి' అని ఈట‌ల చెప్పారు. తెలంగాణ మేధావులంతా కేసీఆర్ పై పోరాటంలో కలిసిరావాలని కోరారు. కానీ కేసీఆర్ ను ఓడించేందుకు హుజురాబాద్ లో యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈటెల.

Related Posts