YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కోమటిరెడ్డి వ్యాఖ్యలు అనుచితం

కోమటిరెడ్డి వ్యాఖ్యలు అనుచితం

భువనగిరి
భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  ఎంఎంటీఎస్ ను  నేనే తెచ్చానని చెప్పు కోవడం హాస్యాస్పదమని భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. 2016 లో తాను  పార్లమెంటు సభ్యుడిగా వున్నప్పుడే మంజూరు చేయించానని వెల్లడించారు.  శనివారం నాడు అయన ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ ఎంఎంటీఎస్  నేను తెచ్చానని చెప్పడం మంచిది కాదని, ఏప్పుడూ సిఎం కెసిఆర్ ను విమర్శించడం మాని నువ్వు గల్లి లీడర్ వి కావు ఎంపి వి డిల్లీ గురించి మాట్లాడలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ప్తె దృష్టి పెట్టాలని కోమటి రెడ్డికి ఈ సందర్భంగా హితవు చేశారు. అలాగే జిల్లాకు డయాగ్నస్టిక్ సెంటర్ మంజూరు అయిందని,  దానిపై కూడ కొందరు చిల్లర రాజకీయలు చేస్తున్నారని ఆవి  మానుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసిందని కొన్ని అనివార్య పరిస్థితుల మూలంగా ఓ  పది శాతం కొనుగోలు చేయలేదన్నారు త్వరలో అవుకూడ కొంట్టారని దానిని కూడ రాజకీయం చేస్తే ర్తెతులు తిరస్కరిస్తారని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్తె అపోహలు వద్దని రెండు మంచివేనన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ చ్తెర్మన్ అమరేందర్, తెరాస నేతలు పాల్గొన్నారు.

Related Posts