YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మామిడి వ్యాపారుల కార్బైడ్ దోపిడి

 మామిడి వ్యాపారుల కార్బైడ్ దోపిడి

మామిడి పండ్ల సీజన్ మొదలైంది. అయితే తీయటి మామిడి పండ్లు దొరకడం మాత్రం కష్టంగా మారింది. వేసవి సీజన్‌లో మామిడి పండ్లలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత ధర ఉన్న ప్రజలు కోనడానికి వెనకాడరు. కాని ఈ సారి మాత్రం ప్రజలు మామిడి పండ్లను కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. మామిడి పండ్ల వ్యాపారులు ఆదాయమే లక్ష్యంగా కార్బైడ్‌ దందాను సాగిస్తున్నారు. పచ్చిమామిడి కాయలపై కార్బైడ్ అనే రసాయనాన్ని చల్లి మగ్గపెడుతున్నారు. దీంతో హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసినా కార్బైడ్‌ రసాయనాలతో కలుషితం అయిన పండ్లే అమ్మకానికి పెడుతున్నారు.మార్కెట్లో కార్బైడ్‌, ఇథలిన్‌ వంటి రసాయనాలతో మామిడి కాయలను మగ్గపెడుతున్నారు. రసాయన పర్థాదాలు చల్లి పండించిన పండ్లను తీనండం ద్వారా అనారోగ్యంపాలవుతున్నామని జనం ఆందోళన చెందుతున్నారు.హైదరాబాద్ కొత్తపేట ప్రూట్స్‌ మార్కెట్ గడ్డిఅన్నారం తదితర మార్కెట్లలో కార్బైడ్‌ పెట్టకుండా నేచురల్‌గా పండించిన పండ్లకోసం దుర్భిణి వేసుకుని వెదకాల్సిన పరిస్థితినెలకొంది. ఒకరో ఇద్దరో తప్పిస్తే చాలా మంది వ్యాపారులు కార్బాయిడ్‌తో మగ్గపెట్టిన పండ్లనే అమ్ముతున్నారు. గతంలో కార్బైడ్‌ను వాడకుండా పలువురు వ్యాపారులకు అధికారులు నోటిసులు జారిచేశారు. కాని అధికారుల ఆదేశాలు పక్కన పెట్టేసిన కొందరు వ్యాపారులు కార్బాయిడ్‌ దందాను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఛాదార్‌ఘాట్, పాతబస్తి, తదితర ప్రాంతాల్లో ఇథలీన్ వాడకాలు జోరుగా సాగుతున్నాయి.నల్గొండ, మహాబుబ్ నగర్ జిల్లాలతోపాటు ఏపీ నుంచి రోజుకు 60వేల టన్నుల మామిడి పంట కొత్తపేట ప్రూట్‌మార్కెట్‌కు చేరుకుంటోంది. ఇక్కడి న ఉంచి రోజుకు 300డీసీఎంలలో పండ్లు వేరే ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి అయిన సరుకంతా కూడా కార్బైతో పాటు, చైనానుంచి దిగుమతి అవుతున్న ఇథలిన్‌ రసాయనాలతో పండిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు ఎలాంటి సమాచారం అందింన తమకు దృష్టికి తెవాలని పోలీసులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో అన్ని కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లే కావడంలో వాటికి రంగు రూచి ఉండడంలేదు. దళారీలు, టోకు వ్యాపారులు ఇలా నాలుగంచల దళారీల వ్యవస్థ మార్కెట్లో రాజ్యమేలుతోంది. కల్తీ పండ్ల మాయాజాలంలో అసలు సిసలు మామిడి పండ్ల రుచులకు దూరం అవుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. 

Related Posts