YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జీవన విధానం

జీవన విధానం

మనలో ఉన్న దానికి కోసం మనము వెతికే ప్రయత్నం చేయాలి, అది సాధించాలి.
ఉదాహరణకు మనకి భౌతిక అవసరం ఉందనుకోండి, మనం తప్పకుండా బహిర్ముఖం అవ్వాలి, కర్మ చేయాలి దానిని సాధించాలి. అంటే కర్మలు మన దగ్గర లేని వాటిని పొందే ప్రయత్నాలు అన్న మాట. అటువంటి కర్మలకి తప్పకుండా ఫలితాలు కావాలి వాటికై మనము ఎదురు చూడలి. తప్పదు. కర్మఫలితాలు మనం కావాలి అన్నప్పుడు మనకు రావు. అవి వాటి సమయానుకూలంగా వస్తాయి. రోజుకి మనం ఎన్నో కర్మలు చేస్తాము, వాటి ఫలితాలు కోరుకుంటాం. ఇలా కర్మఫలాలు అనుభవించే స్థితి మనకి మనమే సృష్టించుకున్నాము. మన శరీరానికి ఒక ఆయు: ప్రమాణము ఉంటుంది, అది దాటాక శరీరం శిథిలం అవుతుంది. అప్పుడు కర్మ ఫలానుభవము కొరకు ఇంకోక శరీరం ధరించాలి, కానీ ఆ కొత్త శరీరంతో కర్మ ఫలాలు అనుభవిస్తూ మళ్ళీ  కర్మలు చేస్తాము. ఇలా కర్మ చక్రంలో మనకి మనము బంధించబడతాము. జనన మరణాల చక్రంలో ఇరుక్కుపోతాము. ఎవరో వచ్చి ముక్తి ఇవ్వాలి అని పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు చేస్తాం. వీటి వల్ల ముక్తి రాదు కానీ పుణ్యం వస్తుంది. మన పెద్దలు పుణ్యం వల్ల స్వర్గం లభిస్తుంది అని చెబుతారు. పుణ్య కర్మలతో పాటు అనుకోకుండా కొన్ని పాపకర్మలు కూడా చేస్తాము. ఇది కర్మ విభాగం. మనలో ఉన్నదానిని పొందాలి అనుకుంటూ కర్మలు చేస్తాం. మనలో ఉన్నదానిని తెలుసుకోవాలి కానీ పొందనవసరములేదు. తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి కానీ కర్మ కాదు. ఉదాహరణకు మనం పెన్ను పోగొట్టుకున్నాము దానికై వెతుకుతున్నాము ఇక్కడ పెన్ను ఎక్కడ ఉందో తెలుసుకునే జ్ఞానం కావాలి లేదా పెన్ను ఎక్కడ ఉందో చెప్పే వారు కావాలి. అది మన జేబులోనే ఉండచ్చు మనం దానిని మర్చిపోయి ఉండచ్చు. అంటే జ్ఞానం మరిచినదానిని గుర్తు తెచ్చుకోవడం అన్న మాట. లేదా అది తెలిసిన వాళ్ళు మనకు చూపించడం.(అధ్యాత్మిక పరిభాషలో ఇలాంటి వారిని గురువు అంటారు).సూక్ష్మంగా చెప్పాలి అంటే కర్మ ద్వారా ఎదో పొందడానికి ప్రయత్నంచేస్తాము,జ్ఞానం ద్వారా మరిచిపోయిన దానిని జ్ఞాపకం తెచ్చుకొంటాం. కర్మ బంధము కలిగిస్తే జ్ఞానం ముక్తిని ప్రసాదించుతుంది. మన పెద్దలు ఆజ్ఞానమే బంధము అని అంటారు. దీనినే కారణ శరీరము అని కూడా అంటారు. మన సూక్ష్మ, (మన సంస్కారాలు ఉన్న శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు) స్థూల (భౌతిక శరీరం) శరీరాలకి, కారణ శరీరమే కారణమ. మన వాస్తవ స్వరూప జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. అంతేకాకుండా మనం కానిదానిని మనము అని భావించడము మూర్ఖపు స్థితి. యదార్ధానికి మనము ఆత్మ స్వరూపులం. ఈ జ్ఞానం లేక పోవడం అజ్ఞానము. అలా కాకుండా దేహమే మనము అనుకోవడం  మూర్ఖపు అవహగన.
ఇపుడు మనకి తెలిసింది ఏమిటి అంటే కర్మలు బంధకారకాలు కాకుండా చెయ్యాలి, మన వాస్తవ స్థితిలో మనం ఉండాలి. ఇదే మన జీవన విధానము. దీనికై భగవద్గీత,ఆత్మజ్ఞానం నకు సంబంధించిన గ్రంధాలు అధ్యయనం చెయ్యాలి. ఎందుకంటే వీటికి సమాధానాలు అక్కడ వాటిలో ఉన్నాయి మరి. అలా తెలుసుకుంటూ సాధనతో ముందుకు పయనించాలి.
 

Related Posts