YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎడారిని తలపిస్తున్న కొల్లేరు

ఎడారిని తలపిస్తున్న కొల్లేరు

ఏలూరు, జూన్ 15, 
కొల్లేరు మంచినీటి సరస్సు సహజసిద్ధమైన ప్రకృతి వరప్రసాదం. ఇక్కడ నీరు కరవవుతోంది. ఎటు చూసిన ఎడారిని తలపిస్తోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదోకాంటూరు లోపల 77,138 ఎకరాల్లో  సరస్సు విస్తరించి ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో పలు నదులు, కాలువలు, డ్రెయిన్ల ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది.  కొల్లేరులోని నీరు సక్రమంగా రాకపోవడంతో ఎండిపోతోంది. నీటి మొక్కలకు బదులు ఎడారి మొక్కలు, ముళ్లపొదలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. జీవావరణ సమతుల్యత దెబ్బతిని, పర్యావరణానికి ముప్పు ఏర్పాడే ప్రమాదం పొంచిఉందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సరస్సులో ఏడాది పొడవునా నియంత్రికల నిర్మాణంతో నిల్వ చేయాలని ఇక్కడి ప్రజల వాదన. నాలుగేళ్ల క్రితం  సుమారు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరేది. కొల్లేరు నుంచి సర్కారు కాలువ ద్వారా ఉప్పుటేరుకు అక్కడి నుంచి నీరు బంగాళాఖాతానికి చేరుతుంది. జూన్‌ మొదలు మార్చి వరకు నీరు ఉంటుంది. వరదల సమయంలో విస్తరించిన నీరు ఉప్పుటేరు ద్వారా ప్రతి రోజు 10క్యూసెక్కులు  సముద్రానికి వెళుతున్నట్లు ప్రభుత్వ అంచనాలు. 8, 9 నెలల్లో కొల్లేరు దాని పరీవాహక ప్రాంతాల్లోని రైతులు నీటిని ఉపయోగించి మత్స్య సంపదను పెంచుతారు. సరస్సు పరిధిలో పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు,  కృష్ణా జిల్లాలో కైకలూరు, మండవల్లి మండలాలు నందివాడ గ్రామంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు చేపల సాగు చేస్తుంటారు. చెరువుల్లో నీరు పెట్టి కృత్రిమంగా సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. కొల్లేరుకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి తమ్మిలేరు, గుండేరు నదులతోపాటు రామిలేరు, కట్టేలేరు, బుడమేరు, చంద్రయ్య,  పోల్‌రాజు, రాచకోడు, శాంప్‌ డ్రెయిన్లు వచ్చి చేరతాయి.  పశ్చిమగోదావరి జిల్లాలో జాలీపూడి, కైకారం, తోకలపల్లి, పందికోడు, సిద్దాంతం డ్రెయిన్లు వరదనీటిని తీసుకువస్తాయి. ‌ మోటూరు కాలువ, భూమికోడు, గుడివాడ చానల్‌, రాళ్లకోడు, వడ్లకోటి, పోరునూరి, ఆగడాలలంక, పుల్లా వంటి కాలువలు నీటిని తీసుకువస్తుంటాయి.  ఎక్కడ నీరు అక్కడే వినియోగమయితే  ఇటీవల సరస్సుకు వచ్చే నీటి పరిమాణం తగ్గినట్లు అధికారులు తెలిపారు. పోలవరం కూడి కాలువకు గత ఏడాది తమ్మిలేరు నదిని కలిపేశారు. ‌ వర్షాభావ పరిస్థితులు కూడా నీటి నిల్వలపై ప్రభావాన్ని చూపుతున్నాయి.  మూడేళ్లలో సరస్సుకు 70 నుంచి 80 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చినట్లు గుర్తించామని డ్రెయినేజీ అధికారులు తెలిపారు.

Related Posts