YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వీరుడి విగ్రహం ఆవిష్కరణ

వీరుడి విగ్రహం ఆవిష్కరణ

సూర్యాపేట
భారత-చైనా సరిహద్దులో జరిగిన ఉద్రిక్తత ఘటనలో.. గతేడాది వీరమరణం పొందిన సూర్యాపేట పట్టణవాసి, కల్నల్  సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా.. ఆయన విగ్రహాన్ని సూర్యాపేట కోర్టు సిగ్నల్ దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్ బాబు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర బిరుదుని అవార్డును ప్రధానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ వారి కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వడంతోపాటు.. జూబ్లీహిల్స్ లో వారి కుటుంబానికి ఇంటి స్థలం సహా ఆమెకు డిప్యూటీ కలెక్టర్ హోదా ఉద్యోగాన్ని సైతం అందించారు. తన భర్త కర్నాల్ సంతోష్ బాబు సేవలను గుర్తించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి, సూర్యాపేట ప్రజానీకానికి సంతోష్ బాబు సతీమణి సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కోసం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్తుండటాన్ని ఆమె స్వాగతించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts