YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి దేశీయం

ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఉద్యోగులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ, జూన్ 15,
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ DA (డీఏ) పెంపు కన్నా ముందుగానే మరో గుడ్ న్యూస్ అందించింది. నవోదయ విద్యాలయ స్కూల్ ఉద్యోగులకు శుభవార్త తీసుకువచ్చింది. మెడికల్ క్లెయిమ్ పరిమితి పెంచేసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తాజా ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితి పెరిగింది. ఇప్పుడు ఉద్యోగులు సంవత్సరానికి రూ.25 వేల వరకు పొందొచ్చు. గతంలో ఇది రూ.5 వేలు వరకు మాత్రమే ఉంది.ఉద్యోగులు ప్రభుత్వ లేదా సీజీహెచ్‌ఎస్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకుంటే వారి ట్రీట్‌మెంట్ పరిమితి రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెరిగిందని గమనించాలి. ఇక మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ఇతర రూల్స్ అలాగే ఉంటాయి.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం జూన్ 25న కీలకమైన సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో డీఏ బకాయిల చెల్లింపు అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాగా మోదీ సర్కార్ జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ పెంపు డబ్బులను ఉద్యోగులకు చెల్లించనుంది

Related Posts