YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రమకు గౌరవమివ్వాలి : సీఎం చంద్రబాబు

శ్రమకు గౌరవమివ్వాలి : సీఎం చంద్రబాబు

కార్మికుల శ్రమకు తగిన ఫలితం అందేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రమ సంస్కృతిని అందరూ గౌరవించాలని, కార్మికుల కోసం కార్పొరేట్ హౌసింగ్ విధానానికి యాజమాన్యాలు ముందుకు రావాలన్నారు. ఉపాధి అవకాశాలు లభిస్తే సమాజంలో అలజడి ఉండదని, పనిలేని వారే లేనిపోని సమస్యలు సృష్టిస్తారని చంద్రబాబు తెలిపారు. మంగళవారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  జరిగిన మేడే వేడుకలకు ముఖ్యమంత్రి  హజరయ్యారు. ఈ వేడుకలకు భారీగా కార్మికులు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. జోన్లవారీగా 69 మంది కార్మికులకు శ్రమశక్తి అవార్డులు, 36 మంది పారిశ్రామికవేత్తలకు ఉత్తమ యాజమాన్య అవార్డులు అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ శ్రామికుల సంక్షేమం కోసం ఆలోచనలు చేస్తున్నందుకే నేటి సమాజంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగుతుంది.  నేటి సమాజంలో 50 శాతం మంది కార్మిక , వ్యవసాయ, తదితర రంగాల్లో ఉన్నారు.  చంద్రన్న భీమా ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వొచ్చిందన్నారు. శ్రామికుల కోసం పరిశ్రమలు నిర్వహించే పారిశ్రామిక వేత్తలు ఆలోచనలు చేయాలి.  ఇరువురు పరస్పర శ్రేయస్సు కోసంనిరంతరం పనిచెయ్యలి. నేటి సమాజంలో కార్మికులు ఎంత ముఖ్యమో పారిశ్రామిక వేత్తలు అంతే ముఖ్యమన్నారు. సంపద సృష్టిస్తే పేదరికం సమాజం నుంచి పారద్రోల గలుగుతాం. రాష్ట్రంలో ఏ ఒక్క కార్మికుడు శ్రమ దోపిడీకి గురికాకుండా కృషి చేస్తానని అన్నారు.  రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీల పెంపు జోలికి పోకుండా చర్యలు తీసుకుంటాం.  రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. పని ఉన్న సమాజము ఎప్పుడూ ఆనందంగా ఉంటాయి. రెండు కోట్ల ఎకరాలుకు సాగునీటి ని అందించగలిమన్నారు. విభజన తో చాలా నష్టపోయాం. కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని అన్నారు.  బీజేపీ కి ఏపీ లో ఒక్క ఓటు లేదు,ఒక్క సీట్ లేదు. మన బస్ లు మనం తగలబెట్టుకోవడం వల్ల మనకే నష్టం. ఎవరికి ఇబ్బంది లేకుండా పని చేద్దాం. కార్మికులకు అన్యాయం జరిగేందుకు వీలులేదని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కి నాలుగేళ్లుగా ప్రపంచ దేశాలు తిరిగా....పారిశ్రామికవేత్తలకు నిలయంగా ఏపీ ని నిలపడమే ధ్యేయంగా పనిచేస్తున్న. రాజధాని నిర్మాణానికి ఒక్క పిలుపునిస్తే ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా 34వేల ఎకరాల భూములిచ్చారు. భూముల విలువ పెరిగేలా చర్యలు తీసుకున్నా....ఇప్పుడు భూములిచ్చినవారు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. కరువు జిల్లాగా ఉన్న అనంతపురంలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నుంచి జనవరి లో మొదటి కారు ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నాం.  డిమనిటైజేషన్,జీఎస్స్టీ అమలు అనంతరం గుజరత్ లో నాలుగు లక్షల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. గుజరాత్ టెక్స్ టూల్  రంగంలో వేతనాలు తగ్గాయంటూ ఆర్టికల్ రావడం పై  అయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వ విధానాలవల్ల సంపద సృష్టించడంలో విఫలమైతే ఆ ప్రభావం దేశంపై ఉంటుంది. పాలసీ లను సరిగా అమలు చేయకపోతే ఇలాంటి పరిణామాలే ఉత్పన్నం అవుతాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి....అందుకోసం నిరంతరం పని చేస్తామన్నారు. పరిశ్రమల పక్కనే కార్మికులకు ఇండ్లు నిర్మించాల్సిన అవరసం ఉంది...అందుకోసం చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు ముందుకురావాలి. ఈ సంవత్సరం లొనే ఆ దిశగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. కార్మికుల స్వంత ఇంటికల నేరవేర్చడంలో ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

Related Posts