YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈతగాడు కోట్ల అటెండర్

ఈతగాడు కోట్ల అటెండర్

ఆదాయానికి మించిన ఆస్తులు కల్గి ఉన్నాయనే ఆరోపణలతో నెల్లూరు రవాణా శాఖలో అటెండర్ గా పనిచేస్తున్న నరసింహారెడ్డి నివాసాల్లో ఏసీబీ అదికారులు సోదాలు నిర్వహించారు.  మంగళవారం  ఉదయం నుంచి ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు జరిపారు. మధ్యాహ్నం  వరకు దాదాపు 50 కోట్ల మేర అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈసోదాల్లో 2 కిలోల బంగారు, 7లక్షల నగదు, భారీగా పట్టా కాగితాలు స్వాధీనం చేసుకున్నారు.

 నెల్లూరు నగరంలొని ఎంవీఆర్ అగ్రహారంలో నివసముంటున్న నరసింహారెడ్డి ఇంటిలో విజయవాడ, నెల్లూరు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.. సోదాల్లో ఏసీబీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే అవినీతి చిట్టా బయటపడింది.. 1984లో రవాణాశాఖలో చేరిన నరసింహారెడ్డి అప్పటి నుంచి అకాశమే హద్దుగా అవీనితికి పాల్పడ్డారు.  ప్రమోషన్స్ వచ్చినా వాటిని తిరస్కరిస్తూ  వందల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారు. ప్రాధమికంగా ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తులను పరిశీలిస్తేనే 50 కోట్ల మేర ఉన్నాయి.. ఇంకా కొన్ని బ్యాంక్లులో నరసింహారెడ్డి బార్య, కూతురు, అత్తపేరిట లాకర్లు ఉన్నాయని ఏసీబీ అధికారి రమాదేవి తెలిపారు..

నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టాను పరిశీలిస్తే అతను అటెండరా లేక  అవినీతి అనకొండ అనే అనుమానం రాకమానదు. గుండ్లపాలెంలొ 10 ఇళ్లస్థలాలు, ఎంవీ అగ్రహారం లో 2 ప్లాట్స్, కొండాయాపాలెంలో 3 ప్లాట్స్ , శ్రీహరి నగర్ లో 2 ప్లాట్స్ కలిపి మొత్తం  18 ఇండ్ల స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవే గాక రిచ్ ఏరియాగా పేరుండే ధనలక్ష్మీపురంలో 18 ఎకరాలు, సంగం మండలంలోని పెరమనలో 35 ఎకరాలు కలుపుకుని జిల్లా వ్యాప్తంగా  50 ఎకరాల పొలాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా లాకర్లు సైతం ఉన్నాయని వాటిని గుర్తించామని, చెబుతున్నారు.  మొత్తంగా చూసుకుంటే నెల్లూరుజిల్లా చరిత్రలో ఓ  అటెండర్  నివాసాలపై సోదాలు నిర్వహించడం ఇదే ప్రప్రదమం. అటెండర్ నర్సింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టడం వెనుక రవాణాశాఖ ఉన్నతాధికారుల హస్తముందని ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

Related Posts