ముంబై జూన్ 16
కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మహారాష్ట్ర రాజధాని ముంబైని ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. నగరంలోని హింద్‌మాత, సియాన్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే-చెంబూర్ ప్రాంతాల్లో వరదలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోల్లో చూడవచ్చు.