జగన్ చేస్తున్న జనసంకల్ప యాత్రలో నిన్న ఆత్మకూరు లో అయన కృష్ణ జిల్లా కి నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తున్నానని వాగ్దానం చేసారు, అతను ఇచ్చినా మాటకి తన సొంత పార్టీ నేతల తోనే ఎన్నో విబేధాలు వస్తున్నాయి. కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఒప్పుకోము అని వైసీపీ సలహాదారు దుట్టా రామచంద్రరావు కన్నెర్ర చేసారు. కావలిస్తే జగన్ ని అయన పేరు మీద భవనాలను కట్టుకోమనండి కానీ, కృష్ణ జిల్లా పేరు మార్చడానికి ఒప్పుకోము అన్నారు. వెంటనే జగన్ ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవాలని లేకపోతే అయన పార్టీ కి రాజీనామా చేస్తానని అన్నారు.