విజయనగరం
ప్రజలకు గురువారం నుంచి అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు కొనసాగిస్తానని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కరోనా బారిన పడి 57 రోజులుగా విశాఖపట్నం లో ఉన్న ఎమ్మెల్యే కోలగట్ల బుధవారం నాడు నేరుగా విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్లు జంక్షన్లో వేంచేసియున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే కోలగట్ల కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోలగట్ల అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను ఎమ్మెల్యే కోలగట్ల కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోలగట్ల ఆలయం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పైడితల్లి అమ్మవారు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, యావత్ ప్రజలు చేసిన పూజలు , ఫలితాల వల్ల తాను ఆరోగ్యంగా తిరిగి రావడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వచ్చిన వారికే ఆ బాధ తెలుస్తుంది అన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ వల్ల , దాని బారిన పడి, అనారోగ్యం పాలై, ప్రాణాలు కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు లు చైతన్యం రావాలని, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. విజయనగరం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు కరోనా విపత్కర సమయంలో ప్రజలకు అండగా ఉండి, సేవలు చేస్తున్న సమయంలో కొంతమందికి కరోనా సోకి మరణించడం జరిగింది అన్నారు. 57 రోజులుగా తాను విజయనగరంలో లేకపోయినా తన కుమార్తె శ్రావణి, అల్లుడు ఈశ్వర్ కౌశిక్, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండి సేవలు అందించడం, వారికి ధైర్యాన్ని భరోసాను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజల సేవ కు కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అనడానికి నిదర్శనం అన్నారు. తాను ఊర్లో, లేకపోయినా సేవా కార్యక్రమాలు ఆపకుండా నిర్వహించడం తనకు ఆనందంగా ఉందన్నారు. నగరపాలక ఎన్నికలు లో పట్టణ ప్రజలు తనపై నమ్మకాన్ని, అభిమానాన్ని ఉంచి విజయాన్ని అందించడం జరిగిందన్నారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా తన పనితీరు ఉంటుందన్నారు.ఎండాకాలంలో తనులేకపోయినా వేసవిలో మంచినీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఫోన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రివైయస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఆలోచనలతో ఆసుపత్రుల సంఖ్య పెంచడం, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, ప్రజలకు ధైర్యాన్ని కల్పించడం జరుగుతోందని అన్నారు..గురువారం నుంచి తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్నారు. అనంతరం ఆయన కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించారు. ఆలయానికి చేరుకోగానే ఆలయ చైర్మన్ నారాయణం శ్రీనివాస్, మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే కోలగట్ల కు సాదర స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే కోలగట్ల కు ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఉచిత రీతిన సత్కరించారు. అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆశపూ వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు, జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్, కాళ్ల సూరిబాబు , కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కాపు గంటి ప్రకాష్, కుమ్మరి గంట శ్రీనివాసరావు, కట్టమూరి మురుగన్, రవ్వ శ్రీనివాస్ , బుద్దేపువెంకటరావు, పేర్ల సీతారామయ్య శెట్టి,తదితరులు ఉన్నారు.