YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కార్పోరేట్ స్థాయిలో పఠాన్ చేరు ఈఎస్ ఐ ఆసుపత్రి

కార్పోరేట్ స్థాయిలో పఠాన్ చేరు ఈఎస్ ఐ ఆసుపత్రి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పఠాన్ చేరు లోని ఈఎస్ ఐ  ఆసుపత్రి పరిస్థితి దయానీయంగా మారిందని మెదక్ ఎంపీ  కొత్త ప్రభాకర్ రెడ్డి  అన్నారు. కార్పొరేట్ స్థాయిలో 200 పడకలఈఎస్ ఐ  ఆసుపత్రి నిర్మించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వస్తామని వెల్లడించారు. మంగళవారం నాడు  సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గ స్థాయిలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మే డే సంధర్బంగా తెరాస కార్మిక విభాగం జండాను ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ  భూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి ఎగురవేసారు. ఈ సంధర్బగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని పని చేస్తుందని అన్నారు. పఠాన్ చేరు నియోజక వర్గంలో కాలుష్య కారక పరిశ్రమల వ్యర్ధాలతో ఇక్కడ ప్రజలు తీవ్ర అనారోగ్యల బారిన పడుతున్నారని వారిని కాపాడుకొని బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. త్వరలోనే పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారని అన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయనున్నారని ఎంపీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

Related Posts