YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గడువు దాటిన ఇంజంక్షన్ వాడిన యశోద ఆసుపత్రి రూ.30 కోసం కక్కుర్తి.. మార్కెట్ పోలీసులకు పిర్యాదు చేసిన రోగి భార్య

గడువు దాటిన ఇంజంక్షన్ వాడిన యశోద ఆసుపత్రి రూ.30 కోసం కక్కుర్తి.. మార్కెట్ పోలీసులకు పిర్యాదు చేసిన రోగి భార్య

సికింద్రాబాద్
తన భర్త ముక్కు ఆపరేషన్ కోసం వస్తే గడువు దాటిపోయిన మత్తు ఇంజక్షన్ ఇచ్చారని ఓ మహిళ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. వివరాల లోకి వెలితే నిర్మల్ నీటి పారుదల శాఖలో డీ ఈ గా పని చేసే జగదీష్ (48)కు ముక్కుల్లో కండరాలు పెరగడంతో శ్వాస  తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఇటీవల సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అయితే శస్ర్త చికిత్స కోసం బుధవారం ఉదయం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే ఉదయం 9 గంటల సమయం లో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు ఒక నర్సు వచ్చి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అటు తర్వాత ఆయన భార్య భార్గవి వచ్చి మత్తు ఇంజక్షన్ పరిశీలించగా దానిపై ఉత్పత్తి తేదీ జనవరి 2019గా గడువు 2020 డిసెంబర్ గా ఉంది. దీన్ని గుర్తించిన ఆమె 2020 డిసెంబర్ లో గడువు ముగిసిన ఇంజక్షన్ ఎలా ఇస్తారని ఆసుపత్రి వర్గాలు ప్రశ్నిస్తే అది ఏమి కాదని తేలికగా కొట్టేశారు. గడువు దాటినా ఆరోగ్యానికి ఏమి కాదంటూ ఎవరు పట్టించుకో లేదు...దీంతో ఆమె తన భర్త ఆరోగ్యానికి భవిష్యత్తులో ఏమైనా అవుతుందనే ఆందోళనతో మార్కెట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు...ఎస్ఐ రమేష్ నాయుడు పిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసుకున్న ఆయన దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి  విచారణ చేస్తామని మార్కెట్ ఎస్ ఐ రమేష్ నాయుడు తెలిపారు...ఇంత పెద్ద ఆసుపత్రిలో రూ.30 ఇంజక్షన్ కోసం ఇలా  ఆసుపత్రి వర్గాలు కక్కుర్తి పడ్డాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు . భవిష్యత్ లో తన భర్తకు ఏమైనా జరిగితే ఆసుపత్రి వర్గాలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆమె చెప్పారు..

Related Posts