కర్నూలు జూన్ 17
జగన్ పార్టీ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ అది ఎన్నటికీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యే...
నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదే: అన్న వైఎస్సార్ సీపీ అధినేత లు మహబూబ్ బాషా, అబ్దుల్ సత్తార్
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చే స్తున్నట్లు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఇటీవల ఢిల్లీ హై కోర్టు తమ పిటిషన్ పై ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు గురువారం కర్నూల్ లో వారుఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ పార్టీ రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు లో వేసిన తమ పిటిషన్ WP 4124 /2020 పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టులో ఎస్ ఎల్ పి దాఖలు చేస్తున్నా మన్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది నాసిర్ సహాయంతో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, స్వయాన న్యాయవాది అయిన షేక్ మహబూబ్ బాషా ఈ కేసులో ఇన్ పర్స న్ గా వాదిస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నిజమైన వైయస్సార్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వారు మరోమారు స్పష్టం చేశారు . ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పార్టీ ఎన్నటికీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మాత్రమేఅని , ఎప్పటి కీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలేదని వారు ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ అభిమానులు, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులతో కలిసి త్వరలోనే తమ పార్టీ కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని వారు తెలిపారు. తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటుచే స్తున్న పార్టీ కి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, వైఎస్ఆర్ అనే పదం వాడకుండా చూడాలని ఇప్పటికే తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. రెండుతెలుగు రాష్ట్రాల్లో ని నిజమైన వైఎస్ఆర్ అభిమానులు, రాజన్న రాజ్యం కాంక్షించే వ్యక్తులు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అభివృద్ధికి రాజశేఖర్రెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.