భాజపాను ఓడించే దిశగానే పొత్తులు ఉండాలని నిర్ణయించామని సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో
మాట్లాడుతూ.. రైతుల పక్షాన పోరాటానికి సీపీఐ సిద్ధంగా ఉందని ప్రకటించారు. అన్ని వామపక్ష పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. రాజకీయ విధానంపై తెరాసతో తమకు పూర్తి విభేదాలు ఉన్నాయని, తెలంగాణ జనసమితితో కలిసి పనిచేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించే దిశగా పొత్తులుండాలని నిర్ణయించామని చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటుకు సీపీఐ ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాజకీయ విధానంపై టీఆర్‌ఎస్‌తో తమకు రాజకీయ విబేధాలున్నాయని సురవరం తెలిపారు. తెలంగాణ జనసమితితో కలిసి పనిచేసే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో అవగాహన కష్టమన్న సురవరం రాష్ట్రాల వారీగా పొత్తులుంటాయని స్పష్టం చేశారు. బీజేపీ మతోన్మాద శక్తులు, కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. వారసత్వ సంపదను కూడా కాపాడుకోలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని సుధాకర్ రెడ్డి ఆక్షేపించారు. ఎర్రకోట నిర్వహణ బాధ్యతను ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏకాకిగా మిగలబోతోందని సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి మేలు చేయడం కోసమే కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని... కేసీఆర్ ఫ్రంట్‌ను అమిత్‌షా స్వాగతించడమే దీనికి నిదర్శనమన్నారు. రాజకీయంగా అవగాహన ఉన్నవారెవరూ కేసీఆర్ ఫ్రంట్‌లో చేరరని ఆయన తెలిపారు. వామపక్షాలు కలిసొచ్చే పార్టీలతో ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని సురవరం పేర్కొన్నారు. కేరళలో సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం అయ్యాయని సుధాకర్‌రెడ్డి తెలిపారు. కేరళలో జరిగిన ఆ పార్టీ జాతీయ మహాసభల్లో మరోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సురవరంను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం మగ్ధూం భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఇతర నేతలు ఘనంగా సన్మానించారు.