న్యూ ఢిల్లీ, జూన్ 17
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై,కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్ (సికెఐసి)లో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి), భారత ప్రభుత్వం 484 మిలియన్ డాలర్ల రుణ కేటాయింపు ఒప్పందంపై సంతకాలు చేశాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఇండియన్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్(ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ – ఇసిఇసి)లో సికెఐసి భాగం. ఇది దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని ఉత్పత్తి నెట్ వర్క్‌లతో భారత్ ను అనుసంధానం చేస్తుంది. ఇసిఇసిని అభివృద్ధి చేయడంలో భారత ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామిగా ఎడిబి వ్యవహరిస్తున్నది.భారత ప్రభుత్వం తరఫున తమిళనాడు పారిశ్రామిక అనుసంధాన ప్రాజెక్టు కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా సంతకం చేయగా, భారత్ లోని ఎడిబి కంట్రీ డైరెక్టర్ తకో కొనేషీ ఎడిబి తరఫున సంతకం చేశారు. పారిశ్రామిక సదుపాయాలు, రవాణా, వినియోగ కేంద్రాల మధ్య నిరాటంకమైన సౌకర్యాలుపెంచడానికి ఈ ప్రాజెక్టు కీలకం. ఇది సికెఐసి పరిశ్రమల ఉత్పాదక ఖర్చును తగ్గించడమే కాకుండా వాటిని ప్రోత్సహిస్తుందని, మిశ్రా పేర్కొన్నారు.