YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రజలకు అందుబాటులోకి చింతల్‌కుంట అండర్‌పాస్‌ మార్గం

ప్రజలకు అందుబాటులోకి చింతల్‌కుంట అండర్‌పాస్‌ మార్గం

ల్బీనగర్‌ సమీపంలోని చింతల్‌కుంట చెక్‌పోస్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన అండర్‌పాస్‌ మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ అండర్‌పాస్‌ మార్గాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కృష్ణయ్య హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ నిబద్ధతతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఎల్బీనగర్ లో ఎడమ వైపు చేపట్టిన అండర్ పాస్ 2018 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుంది. రాబోయే 2 నెలల్లో ఎల్బీనగర్ కు మెట్రో కుత. సీఎం కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభిస్తామన్నారు. నాగోల్ ఎల్బీనగర్ ని కలుపుతాం ఇక్కడి నుంచి ఫలక్ నుమా మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు పొడిగిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యలకు స్వస్తి పలికేందుకు బృహత్తర ప్రణాళిక రూపోందించనున్నమని అన్నారు. మూసి మీద ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తాం. మూసీ సుందరికరణ పనులు సాగుతున్నాయి. నగరంలో 185 చెరువులు ఉన్నాయి. మొదటి దశలో 40 చెరువులు ఉపయోగకరంగా మారుస్తాం. గుర్రపు డెక్క కు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. నగరానికి 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 300 ప్రాంతాల్లో  రోడ్ల మీద నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతం. పారదర్శకంగా, ప్రణాళిక బద్ధం గా ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా పనులు చేయాలి, ముందుకి సాగాలని అన్నారు. 

ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ 330 కోట్లతో ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మిస్తున్నాం. కాంట్రాక్టర్స్ కూడా వేగంగా, నాణ్యంగా నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఉండదు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మెట్రోను హయత్ నగర్ వరకు విస్తరించాలని కోరుతున్నామన్ఆనరు. అందరి సహకారంతోనే స్వచ్ఛ హైద్రాబాద్ సాధ్యం అవుతుందని అయన అన్నారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా చేపట్టిన ఈ అండర్‌పాస్‌ ఈ పథకంలో మూడోది. రూ.12.70 కోట్లతో నిర్మించారు. సాగర్‌ రింగ్‌రోడ్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకు మొత్తం 540 మీటర్ల పొడవున ఈ అండర్‌పాస్‌ నిర్మించారు.ఇన్నర్‌రింగురోడ్డులో సంతోష్‌నగర్‌ నుంచి వచ్చే భారీ వాహనాలతోపాటు, నగరం నుంచి సైదాబాద్‌- చంపాపేట- బైరామల్‌గూడ మీదుగా వచ్చే భారీ వాహనాలు సాగర్‌రింగ్‌రోడ్డు చౌరస్తా మీదుగా చింతల్‌కుంట అండర్‌పాస్‌ నుంచి విజయవాడ వైపు సులువుగా వెళ్లేందుకు వీలవుతుంది. కామినేని, ఎల్బీనగర్‌, బైరామల్‌గూడలో నిర్మిస్తున్న స్కైవేల్లో భాగంగా చేపట్టిన ఈ అండర్‌పాస్‌ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు 14నెలలు సమయం పట్టిందని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు విభాగం ఈఈ కృష్ణారావు తెలిపారు. దేశంలోనే అధునాతనంగా ప్రీకాస్ట్‌ విధానంలో స్లాబ్‌లతోపాటు గోడలను సైతం రూపొందించి... అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. అండర్‌పాస్‌ల గోడలకు ఇరువైపులా ప్రయాణికులను ఆకట్టుకునేలా రంగురంగుల చిత్రాలను రూపొందించారు. కళ్లు జిగేల్‌మనే విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు.

Related Posts