YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గరుడ పురాణం

గరుడ పురాణం

అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఒక్క మానవులకే  కాకుండా సకల జీవారాశులకి పునర్జన్మ వున్నదని గరుడపురాణం వివరిస్తుంది. మన ప్రాచీన వాజ్ఞ్మయం పంచియిచ్చిన వేద వేదాంగాలు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, అన్నీ కూడా మన ప్రాచీన సనాతన హిందూధర్మ ఆచరణా విధానాలను, విశిష్టతలను చాటిచెపుతాయి.  గరుడపురాణంలో మానవుడు చేసే దానధర్మాలవలన, సత్కర్మలవలన మరణానంతరం ఊర్ధ్వలోకాలలో ఎటువంటి స్థితి సంప్రాప్తిస్తుందో తెలియజేస్తుంది. 
ఇహలోకంలో ...
????గోదానం చేసినందువలన గోలోకంలో చోటు లభిస్తుంది.
????గోవు యీనే సమయంలో ఆ గోవుని, దూడని దానం చేసినవారికి తప్పక వైకుంఠవాసం లభిస్తుంది.
????అన్నదానం చేసినవారు తాము ఇష్టపడిన లోకంలో సుఖంగా వుంటారు.
????ఛత్ర (గొడుగు) దానం చేసిన వారు 1000 సంవత్సరాలు వరుణ లోకంలో సుఖాలు అనుభవిస్తారు.
????రాగి, నెయ్యి, మంచం, పక్కలు, చాప, దిండు మొదలైనవాటిలో ఏది దానం చేసినా సత్యలోకంలో సుఖాలు అనుభవిస్తారు.
????వస్త్ర దానం చేసిన వారు వాయు లోకంలో  10000 సంవత్సరాలు జీవిస్తారు.
????రక్తం , కళ్ళు, అవయవాలు దానం చేసినవారు అగ్ని లోకంలో ఆనందంగా వుంటారు.
????ధాన్యం, నవరత్నాలను దానం చేసిన వారు మరు జన్మలో మేధావిగాను దీర్ఘాయువు కలిగి వుంటారు.
????సత్కార్యాలు చేసేవారు సూర్యలోకానికి వెడతారు.
????ఒక కన్యకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమంగా పెంచి వివాహం చేసినవారికి  14 మంది ఇంద్రుల ఆయువుకాలం స్వర్గలోక అమరావతిలో నివాసం లభిస్తుంది.
????బంగారం, వెండి ఆభరణాలు దానం చేసిన వారికి కుబేర లోకంలో ఒక మన్వంతరం నివాసం లభిస్తుంది.
????ధన సహాయం చేసిన వారికి శ్వేత దీపంలో దీర్ఘకాలం నివాసం లభిస్తుంది.
????సకల జీవులకు ఉపయోగపడే  వృక్షాలు నాటి పెంచినవారు తపోలోకానికి వెడతారు.
????ఆలయాల నిర్మాణానికి దానం చేసేవారు 64 సంవత్సరాలు పరమపదంలో వుంటారు.
????దేవుని ఊరేగింపులు జరిపే వీధులన్నింటినీ శుభ్రపరిచేవారు 10000 సంవత్సరాలు ఇంద్రలోకంలో సుఖిస్తారు.
????పౌర్ణమినాడు  ఊయల ఉత్సవ సేవ చేసేవారు భూలోకంలోను పరలోకం లోను సుఖాలు అనుభవిస్తారు.
????రుచిగల ఫలాలను దానం చేసేవారు  ఒక పండుకి ఒక సంవత్సరం చొప్పున గంధర్వలోకంలో నివసిస్తారు.
????ఒక చెంబు మంచినీటిని ఒక మంచిమనిషికి దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది.
????అరుణోదయాన గంగలో స్నానం చేసినవారికి 60000 సంవత్సరాలు పరమపదం లో వుంటారు.
????వ్రతాలు, నోములు భక్తితో ఆచరించేవారు 14 ఇంద్ర ఆయువు కాలాలు స్వర్గం లో నివసిస్తారు.
????సుదర్శన హోమం, ధన్వంతరి హోమం చేసేవారు ఆరోగ్యం కలిగి శత్రువులు లేకుండా దీర్ఘాయువుతో వుంటారు.
????గరుడపురాణం చదివే వారు, వినే వారు పుణ్యకాలాలలో దానం దానం యిచ్చేవారు తమ అంతిమకాలంలో  మంచి లోకాలను  చేరుకుని సుఖిస్తారు. వారి తల్లి తండ్రులు, పితామహులు ముక్తి పొందుతారు.
ఈవిధంగా గరుడ పురాణం మానవుడు చేయదగిన మంచి కార్యాల గురించి బోధిస్తున్నది.

Related Posts