ర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేడెక్కించారు.వచ్చేనెల జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తుందని, యడ్యూరప్ప సీఎం అవుతారని ప్రధాని మోదీ అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ రోజు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంటులో తాను 15 నిమిషాలు మాట్లాడితే మోదీ సభలో కూర్చోలేరని అన్నారు. సరిగ్గా చెప్పారు.. మేము మీ ముందు కూర్చోలేము. ఎందుకంటే మీరు గొప్పవారు. మీ ముందు కూర్చునేముందు మాలాంటి పనిమంతులకు ఏం స్థాయి ఉంది. మోదీ సంగతి వదిలేయండి రాహుల్.. మీరు ఒక పని చేయండి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. చామరాజ్‌నగర్‌లోని సంథెమరహళ్ళి లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీకి ఓ సవాల్ విసిరారు. కాగితం మీద రాసుకుని కాకుండా 15 నిమిషాలపాటు గడగడ మాట్లాడాలని నిలదీశారు.ఆయన (రాహుల్ గాంధీ) నాకు సవాల్ విసిరారు. తాను (రాహుల్) 15నిమిషాలపాటు మాట్లాడితే నేను (మోదీ) తన (రాహుల్) ముందు నిలబడలేనన్నారు. మీరు (రాహుల్) ఇంగ్లిష్ మాట్లాడవచ్చు హిందీ మాట్లాడవచ్చు లేదా మీ అమ్మగారి మాతృ భాష మాట్లాడవచ్చు. మీరు కోరుకున్న భాషలో మాట్లాడండి. కాగితం మీద రాసుకున్నది చదవడం కాకుండా15నిమిషాలపాటు గడగడ మాట్లాడండి. గత ఐదేళ్ళలో మీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడండి. మీరు అలా చేయగలిగితే కర్ణాటక ప్రజలు నిర్ణయిస్తారు అని మోదీ అన్నారు.కన్నడ ప్రముఖుల పేర్లను చెప్పడంలో రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా మోదీ ప్రస్తావించారు. బసవేశ్వర, విశ్వేశ్వరయ వంటి పేర్లను పలకడంలో రాహుల్ ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజల ముందు ఒకసారి బసవేశ్వర, విశ్వేశ్వరయ పేర్లను సరిగ్గా పలకాలని కోరుతున్నానని మోదీ అన్నారు.రాహుల్ వంశపారంపర్య రాజకీయాలను కూడా మోదీ ఎద్దేవా చేశారు. మీరు పేరు మోసుకుని తిరిగేవాళ్ళు, నేను శ్రమించేవాడిని. మీ ముందు కూర్చోవడానికి నాకు ఉన్న అధికారం ఏమిటి అన్నారు.ఎన్నికల సందర్భంగా హిందీ లేక ఆంగ్లం లేక మీ అమ్మగారి మాతృభాష ఇటాలియన్‌లో 15 నిమిషాలు కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాలని కాగితం చూడకుండా మాట్లాడండి. అలా చేస్తే మీ మాటల్లో ఉన్న దమ్ముఏంటో కర్ణాటక ప్రజలే నిర్ణయిస్తారు" అని మోదీ వ్యాఖ్యానించారు.2005లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఉన్న సోనియా గాంధీ.. 2009లోపు తాము 'రాజీవ్ గాంధీ గ్రామీణ్ విద్యుతీకరణ్ యోజన' కింద దేశంలోని విద్యుత్‌లేని గ్రామాలన్నింటికీ విద్యుత్ అందిస్తామని అన్నారని మోదీ చెప్పారు. మరి ఎందుకు అందించలేదో సోనియా కానీ రాహుల్ గాంధీ కానీ సమాధానం చెప్పగలరా? అని మోదీ ప్రశ్నించారు. 1947 నుంచి అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 18,000 గ్రామాలకు విద్యుత్ అందించలేకపోయిందని విమర్శించారు.