YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో అపరిచితులు

వైసీపీలో అపరిచితులు

నెల్లూరు, జూన్ 18, 
సొంత పార్టీకే వారు అపరిచితులుగా మారిపోయారా. వారికి పార్టీకి మధ్య అతి పెద్ద గ్యాప్ ఏర్పడిందా. ఎన్నికల్లో టికెట్ తీసుకోవడం గెలవడం వరకే వారు పరిమితం అయిపోయారా. వైసీపీ సర్కార్ బంపర్ విక్టరీని అందించిన 151 నంబర్ లోనే వారిని చూసుకోవాల్సిందేనా. ఇదంతా వైసీపీలోని మెజారిటీ ఎమ్మెల్యేల ఆవేదన. వారిలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరాశకు ఇది దర్పణంగా చూడాలి. తాము పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలమని, తమ నియోజకవర్గంలో జనాలకూ అక్కరలేదు. అటు జగన్ కీ పట్టడంలేదని మదనపడుతున్నారుట.ఈ మధ్య ఎందుకో వైసీపీ పెద్దలు తన పార్టీలో యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు అన్న దాని మీద చిన్నపాటి సర్వేని ఒకదాన్ని నిర్వహించారుట. అయితే అందుకో చాలా ఆశ్చర్యకరమైన విషయాలే వెలుగు చూశాయట. ఎంపీలు, ఎమ్మెల్యేలలో మెజారిటీ అసంతృప్తిగా ఉంటున్నారుట. తమకు ఏ రకమైన అధికారాలు లేవని, జనాలు కూడా అసలు గుర్తించడం లేదని, తాము చేసేందుకు ఏమీ లేదని కూడా భావిస్తున్నారుట. వైసీపీ అధినాయకత్వం కూడా తమను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు అన్న బాధ కూడా వారిలో ఉందిట.ఇక ఎమ్మెల్యే అంటేనే ఒక అందం. అది కూడా అధికార పార్టీలో ఉంటే ఆ కిక్కే వేరు, లెక్కే వేరు. కానీ జగన్ జమానాలో ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదని అర్ధమైపోయిందట. అటు జగన్, ఇటు జగం మధ్యలో ఎవరూ లేరు. అలా జగన్ డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయారు. ఇక వారికి అనుసంధానంగా వాలంటీర్లు ఎటూ ఉన్నారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది కూడా జనాలకు అవసరం లేకపోతోంది. వారికి పవర్స్ కూడా లేవు అని జనాలకు తెలిసిపోయిందిట. దాంతో మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఏ ఒక్క నియోజకవర్గంలో జనాలు ఠక్కున చెప్పే సీన్ అన్నదే లేదుట. అలా తమ సొంత పార్టీకి నియోజ్కవర్గానికి ఎమ్మెల్యేలు అపరిచితులుగా మారిపోయారుట.కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. మరి రెండెళ్ల పాలన గడచింది ఏమి బావుకున్నామని వారంతా బావురుమంటున్నారుట. ఇటు జనంలో గుర్తింపు లేక అటు అధినాయకత్వం వద్ద కూడా పలుకుబడి లేక రెండింటికీ చెడిపోయామని కూడా ఫీల్ అవుతున్నారుట. అప్పులు చేసి ఎమ్మెల్యే గిరీ తెచ్చుకుంటే వాటి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఇపుడు ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. దాంతో తమ వ్యాపారాన్ని నమ్ముకోవడమే బెటర్ అని చాలా మంది ఉన్న చోట ఉండకుండా హైదరాబాద్, బెంగుళూరు,చెన్నై ఇలా బిజినెస్ పేరిట బిజీ అయిపోయారుట. ఈ సర్వే చూసి వైసీపీ అధినాయకత్వం సైతం ఖంగు తింటోందిట. ఎమ్మెల్యేలు లేకుండా జగన్ ని చూసి ఓటేసినా కూడా వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంతో కొంత తెలిసిన ముఖంగా ఎమ్మెల్యేలు ఉండాలిగా అన్న భావన హై కమాండ్ కి ఉందిట. మరి కరోనా తగ్గాక ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏదైనా నిర్వహించాలన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని టాక్.

Related Posts