YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేనాని ఆచితూచి అడుగులు

జనసేనాని ఆచితూచి అడుగులు

కాకినాడ, జూన్ 18, 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం. గత ఎన్నికల మిగిల్చిన చేదు అనుభవాలను ఆయన ఇంకా మరిచిపోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని విజయపథం వైపు నడపాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉంది. జగన్ ను ఓడించడమే పవన్ కల్యాణ్ లక్ష్యం. అందుకే ఈసారి ఎన్నికల్లో అన్ని రకాల అస్త్రశస్త్రాలతో దిగాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించారు.దీంతో పాటు ప్రధానంగా జగన్ ను ఓడించాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే ముఖ్యం. టీడీపీతో జత కడితేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోతున్నారు. అదే సమయంలో బీజేపీని ఒప్పించే బాధ్యతను కూడా పవన్ కల్యాణ్ తన భుజస్కందాలపై వేసుకున్నట్లు తెలిసింది. ఏపీలో బీజేపీ మిత్రపక్షం అధికారంలోకి రావాలంటే టీడీపీని కలుపుకుని వెళ్లాలన్న డిమాండ్ ను పార్టీ పెద్దల ముందు పవన్ కల్యాణ్ పెట్టే అవకాశముంది.గత ఎన్నికల మాదిరి ఈసారి ఓట్ల చీలికకు పవన్ కల్యాణ్ ఇష్టపడటంలేదు. ప్రధానంగా తనకు అనుకూలంగా ఉన్న కాపు సామాజికవర్గం నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. అయితే బీజేపీతో మాత్రమే కలసి పోట ీచేస్తే అది సత్ఫలితాలనివ్వదు. వైసీపీకి అడ్వాంటేజీగా మారే అవకాశముంది. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుకు సముఖత వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని కూడా ఒప్పించేంుదుకు సిద్ధపడుతున్నారు.గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒకే స్థానాన్ని జనసేన గెలుచుకుంది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి పొత్తులతో వెళ్లి తక్కువ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ విజయాలను సాధించాలన్నది పవన్ కల్యాణ‌్ ఆలోచనగా ఉంది. రోజురోజుకూ బీజేపీ పై పెరుగుతున్న వ్యతిరేకత కూడా పవన్ కల్యాణ్ ఆలోచనలో మార్పునకు కారణమంటున్నారు. బీజేపీ అవునన్నా, కాదన్నా పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుకు సిద్ధమయిపోతున్నారన్న టాక్ పార్టీలో బలంగా వినపడుతుంది.

Related Posts