YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీయే గూటికి జగన్ పార్టీ..?

ఎన్టీయే గూటికి జగన్ పార్టీ..?

విజయవాడ, జూన్ 18, 
వైఎస్ జగన్మోహనరెడ్డి బేషరతుగానే ఎన్డీయేలోకి వెళ్తారా? ఆయన ముందు నుంచి చెబుతూ వస్తున్న ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులతో పాటు ఏపీకి విభజన హామీలకు ఏ రకమైన భరోసా లేకుండానే చేరిపోతారా? అంటే ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. జగన్ మీద ఈ మేరకు తీవ్ర వత్తిడి ఉందని అంటున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ కి కూడా ఎన్డీయేలోకి వెళ్ళేందుకు ఇష్టమే. కానీ కొన్ని హామీలు అయినా కేంద్రం నెరవేర్చితే అపుడు చేరినా జనాలకు జవాబు చెప్పుకోవచ్చు అన్నదే ఆయన ఆలోచనట. జగన్ గతంలోలా గట్టిగా నిలబడడానికి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. కరోనా రెండు సార్లు వచ్చిన తరువాత ఏపీ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింది. అంతే కాదు. గడచిన రెండెళ్లలో చేసేందుకు అప్పులు అయినా దొరికాయి. ఇక ముందు ఆ పరిస్థితి కూడా ఉండదు, దాంతో రానున్న మూడేళ్ళూ గడ్డు కాలంగానే ఉంది. మరో వైపు చూసుకుంటే సీబీఐ కేసులు తోసుకువస్తున్నాయి. జగన్ ఎడంగా బయట ఉండడం వల్ల కేంద్రం కూడా ఆయన విషయంలో ఏ మేలూ చేయలేకపోతోంది. దాంతో జగన్ రాజకీయంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక జగన్ కేంద్రంలో చేరితే చాలా విషయల్లో బిగ్ రిలీఫ్ ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో జగన్ కోరుకున్నట్లుగా కధ సాఫీగా ముందుకు సాగిపోతుంది. అలాగే సీబీఐ కేసుల విషయంలో కొంత తలనొప్పి తగ్గే చాన్స్ ఉంటుంది. ఇక రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు లాంటి వారు మరింతమంది పార్టీలో లేవకుండా ఉంటారు. ర‌ఘురామ నోటికి కూడా అర్జంటుగా తాళం పడుతుంది. అదే సమయంలో కేంద్రం నేరుగా నిధులు ఇవ్వకపోయినా అప్పులు తెచ్చుకునే విధంగా అయినా మార్గాలు చూపిస్తుంది. దాంతో మిగిలిన మూడేళ్ల కాలం కొంత ఇబ్బంది లేకుండా గడిపేయవచ్చు.మోడీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణ చేస్తున్నారు. చాలా ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కొత్త ముఖాలను కూడా తీసుకుంటారు. ఇక ఇదే లాస్ట్ విస్తరణ అని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇపుడు కనుక జగన్ నో అంటే కచ్చితంగా ఎన్డీయేతో దూరం పెరిగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టచ్ మీ నాట్ అంటూ బీజేపీతో వ్యవహరిస్తే ఈ మూడేళ్ల కాలమే అసలు కదిలే సీన్ ఉండదు, ఇక జగన్ ఎస్ అంటే మాత్రం రెండు మంత్రి పదవులతో పాటు చాలా సమస్యలు తీరిపోతాయి. ఏపీలో విపక్షం నోరెత్తకుండా ఉంటుంది. ఒక విధంగా జగన్ ఇపుడు అతి పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఎన్డీయేలో చేరితే వైసీపీ సిద్ధాంతాలు గాలికి కొట్టుకుపోతాయి. బీజేపీ వ్యతిరేకతతో తానూ మునగాల్సి వస్తుంది. అలాగని చేరకపోతే ఈ రోజు నుంచే ఎదురీదాలి. ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మొత్తానికి జగన్ తీసుకున్నే ఏ నిర్ణయం అయినా సంచలనమే అవుతుంది అంటున్నారు.

Related Posts