అభం శుభం తెలియని బాలికపై అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్ నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. బోరబండలోని ఓ థియేటర్‌లో ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది సోమవారం థియేటర్‌లో తమ కూతురిపై అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఎన్ని చట్టాలు వచ్చినా అటువంటి దారుణాలకి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. కథువాలో జరిగిన దారుణ ఘటన తరువాత అటువంటి నేరస్తులకి మరణశిక్ష విధించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ మృగాళ్లు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.