నెల్లూరు
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పాలిచర్లవారిపా ళెం లో రైతుల ధాన్యం ప్రమాదవశాత్తు కాలి బుడిదైన ఘటన చోటుచేసు కుంది. గ్రామం లోని ముగ్గురు రైతులు గ్రామ సమీపంలో పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో పక్కపక్కగా రైతులు ధాన్యం రాశులుగా పోసి ఉంచారు. పక్కనే నరికి వేసి ఉన్న జామాయిల్ తోటకు నిప్పు అంటుకోవడంతో ఆ మంటలు దాన్యపు రాశులకు అంటుకున్నాయి. రూ.2.88 లక్షల విలువ జేసే 49 పుట్ల ధాన్యం రాశులు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు చెలరేగాడంతో రైతులు ఆందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సగానికి పైగా ధాన్యం కాలి బూడిదయింది. కళ్ళ ముందే పండిన పంట అగ్నికి ఆహుతి అవడం తో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.