టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం నాడు వైకుంఠంలో ఆకస్మిక తనికీలు చేసారు. ఈ సందర్బంగా అయన సామాన్య భక్తుల భాదలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ కొనసాగుతున్నది. స్వామి వారి సర్వ దర్శనానికి 15 గంటలకి పైగా సమయం పడుతున్నది. అయితే చైర్మన్ గా పదవీ భాద్యతలు చేపట్టిన పుట్టా సుధాకర్ యాదవ్ దనదైన శైలిలో తనికీలు చేపట్టారు. టిటిడి అదికారులకు ఎవ్వరికి చెప్పకుండా ఆకస్మిక తనికిలు నిర్వహించారు. భక్తుల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైకుంఠంలోకి ఆకస్మికంగా వెల్లిన చైర్మన్ కు అక్కడ భక్తులు పడుతున్న భాదలు కళ్లారా చూశారు. బాత్ రూమ్స్ ఉన్నా... వాటికి తాళాలు వెసిపెట్టిన సిబ్బందిపై అగ్రహం వక్తం చేశారు. తాళాలు వేస్తే బాత్ రుమ్ కి భక్తులు వెల్లాలంటే భక్తులు ఎలా వెళాతారని, ఇది రిపిట్ అయితే మీపై తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్త్ ఆపీసర్ షర్మిస్టని పిలిపించారు. ఎందుకు ఇలా శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. భక్తులు ఎక్కువ ఉండే అన్ని ప్రాంతాలలో ఎప్పటి కప్పుడు సుబ్రపరుచుకోవలసిన భాద్యత శానిటేషన్ అదికారులకు లేదా అని ప్రశ్నించారు.